Baby | విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం బేబి. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా కేవలం ఐదారు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 80 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసి అందరిని ఆశ్చర్యపరచింది. ఇందులో ఆనంద్‌తో పాటు వైష్ణవి, విరాజ్‌లు కీలక పాత్రలు పోషించగా, ఈ చిత్రాన్ని దర్శకుడు సాయి రాజేష్ బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కించాడు. థియేటర్‌లో మంచి రెస్పాన్స్ దక్కించుకున్న ఈ చిత్రం […]

Baby |
విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం బేబి. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా కేవలం ఐదారు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 80 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసి అందరిని ఆశ్చర్యపరచింది. ఇందులో ఆనంద్‌తో పాటు వైష్ణవి, విరాజ్‌లు కీలక పాత్రలు పోషించగా, ఈ చిత్రాన్ని దర్శకుడు సాయి రాజేష్ బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కించాడు.
థియేటర్‌లో మంచి రెస్పాన్స్ దక్కించుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోను సక్సెస్‌ఫుల్‌గా దూసుకు పోతుంది. అయితే ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు డ్రగ్ కల్చర్ ని ప్రోత్సహించేలా ఉన్నాయంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చిత్ర యూనిట్‌పై మండిపడ్డట్టు ప్రచారం జరిగింది.
ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో రైడ్ చేసినప్పుడు బేబీ సినిమాలో కనిపించిన సన్నివేశాలు అక్కడ కనిపించాయని ఆనంద్ అన్నారు. బేబి సినిమా చూసే నిందితులు ఆ విధంగా పార్టీ చేసుకున్నారని, చిత్రంలో ఇలాంటి సన్నివేశాలు పెట్టినప్పుడు కనీస హెచ్చరిక కూడా చేయలేదు.
మేము హెచ్చరించాకే కాషన్ లైన్ వేసారని, ఇక నుండి అన్ని సినిమాలపై దృష్టి పెడతామని ఆనంద్ అన్నారు. అలాంటి సన్నివేశాలు ఉంటే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో బేబీ చిత్రం చిక్కుల్లో ఇరుక్కుదని అనేక ప్రచారాలు సాగాయి.
దీనిపై చిత్ర నిర్మాత ఎస్ కె ఎన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. తాను, చిత్ర దర్శకుడు సాయి రాజేష్.. సివి ఆనంద్ ని కలసి ఈ వివాదం పై చర్చించినట్టు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. సివి ఆనంద్ గారికి తమకి మధ్య చాలా కూల్ గా సంభాషణ జరిగిందని బేబి నిర్మాత అన్నారు.
CP WARNING TO #BABY TEAM pic.twitter.com/vUdMCquty0
— vidhaathanews (@vidhaathanews) September 15, 2023
సలహా ఇచ్చే ఉద్దేశంతో నోటీసులు ఇష్యూ చేస్తే అదేదో యాక్షన్ తీసుకున్నట్లు, లీగల్ నోటీసులు వచ్చినట్లు కాదని ఎస్‌కేఎన్ అన్నారు.. ఈ చిత్రంలో డ్రగ్స్ వినియోగం గురించి ఒక అప్పీల్ మాదిరిగా ఇచ్చారు..
మా చిత్రం సెన్సార్ బోర్డు ద్వారా సెర్టిఫికెట్ పొందింది అని ఎస్ కె ఎన్ సీపీని కలిసిన వీడియోని కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం బేబి సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఆహాలో కూడా ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది.
