Wednesday, March 29, 2023
More
    Homelatestవామపక్షాలతో కలిసి BJPని ఓడిస్తాం: తమ్మినేని

    వామపక్షాలతో కలిసి BJPని ఓడిస్తాం: తమ్మినేని

    • బీజేపీది కార్మిక వ్యతిరేక ప్రభుత్వం
    • మార్చి 15న వరంగల్‌లో భారీ సభ
    • గుడిసెవాసులకు పట్టాలు ఇవ్వాలి

    విధాత: వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: దేశంలో, రాష్ట్రంలో బీజేపీని ఓడించేందుకు సహచర వామపక్షాలను కలుపుకొని సమిష్టిగా కృషి చేస్తామని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సీపీఎం(ఐ) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. బీఆర్ ఎస్తోపాటు కలిసొచ్చే పార్టీలను కలుపుకొని బీజేపీ వ్యతిరేక ప్రచార కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతామని తెలియజేశారు.

    వరంగల్ నగరంలో మంగళవారం జరిగిన జిల్లా పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ప్రసంగించారు. రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా చేపట్టిన ప్రచార కార్యక్రమంలో భాగంగా మార్చి 17న వరంగల్ నగరంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తమ్మినేని ప్రకటించారు. ఈ బహిరంగ సభకు పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరుకానున్నట్లు తెలిపారు.

    బీజేపీ కార్మిక వ్యతిరేక ప్రభుత్వం

    బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నా కార్మికులకు పని భద్రత కల్పించలేదని తమ్మినేని విమర్శించారు. పోరాడి సాధించుకున్న చట్టాలను తుంగలో తొక్కుతూ కార్మికుల వ్యతిరేక చట్టాలు తీసుకొస్తున్నారని విమర్శించారు. బడా కార్పొరేట్ సంస్థలకు, పరిశ్రమల పెట్టుబడి దారులకు ప్రయోజనం కల్పించే లేబర్ చట్టాలు తీసుకొస్తూ కార్మికుల జీవితాలను అగాధంలోకి నెట్టి వేస్తున్నారని విమర్శించారు.

    ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటికరించి, పని భద్రత లేకుండా కార్మికుల జీవితాలతో బీజేపీ ప్రభుత్వం చెలగాటమాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ సంపదను ఒకరిద్దరు తమ తాబేదారులకు కట్టబెట్టేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    గుడిశవాసులకు పట్టాలు ఇవ్వాలి

    రాష్ట్రంలో ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న నిరుపేదలకు ప్రభుత్వం పట్టాలిచ్చి, పక్కా గృహాలు కట్టించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా నాయకురాలు నలిగంటి రత్నమాల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రంగయ్య, రాష్ట్ర కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు జగదీష్, జిల్లా నాయకులు ముక్కెర రామస్వామి, సాగర్, యాదగిరి, ఇసంపల్లి బాబు సమ్మయ్య, కుమారస్వామి, బషీర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular