ఆపద సమయంలో మానవత చాటాలి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఆకస్మిక గుండెపోటు మరణాలను నివారించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన సీపీఆర్ (CPR) శిక్షణ కార్యక్రమాన్ని ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో కొనసాగిస్తున్నారు. వరంగల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం సీపీఆర్ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గుండెపోటుకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిన పేషెంట్ కు ఎలా సీపీఆర్ చేయాలో డాక్టర్లు ప్రాక్టికల్‌గా వివరించారు. శిక్షణ కార్యక్రమాన్ని కొనసాగించారు. […]

  • ఆపద సమయంలో మానవత చాటాలి

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఆకస్మిక గుండెపోటు మరణాలను నివారించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన సీపీఆర్ (CPR) శిక్షణ కార్యక్రమాన్ని ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో కొనసాగిస్తున్నారు. వరంగల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం సీపీఆర్ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా గుండెపోటుకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిన పేషెంట్ కు ఎలా సీపీఆర్ చేయాలో డాక్టర్లు ప్రాక్టికల్‌గా వివరించారు. శిక్షణ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఆపద సమయంలో మానవతా హృదయంతో స్పందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao), మేయర్ గుండు సుధారాణి, జడ్పీ ఛైర్ పర్సన్ గండ్ర జ్యోతి, జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, వర్దన్నపేట శాసనసభ్యులు ఆరూరి రమేష్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, సీపీ ఏ.వి. రంగనాథ్, కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ, శ్రీ వాత్స తదితరులు హాజరయ్యారు.

జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, కలెక్టరేట్ సిబ్బంది, ఇతర ఔత్సాహికులకు ఈ సందర్భంగా శిక్షణ ఇచ్చారు. సీపీఆర్ చేసే విధానం తో పాటు కృత్రిమ శ్వాస అందించే ప్రక్రియను వివరించారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన సిపిఆర్ శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ శశాంక ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated On 18 March 2023 10:30 AM GMT
Somu

Somu

Next Story