రాష్ట్ర ముఖ్య‌మంత్రి హిమాంత బిశ్వ శ‌ర్మ కీల‌క నిర్ణ‌యం విధాత‌: బాల్య వివాహాల‌ను నిర్మూలించేందుకు అసోం ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అసోం వ్యాప్తంగా మాతాశిశు మ‌ర‌ణాల రేటు రోజురోజుకు పెరిగి పోతుండటంతో.. బాల్య వివాహాల‌పై ఉక్కుపాదం మోపాల‌ని ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి హిమాంత బిశ్వ శ‌ర్మ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. బాల్య వివాహాల‌ను నిర్మూలించేందుకు శుక్ర‌వారం(ఫిబ్ర‌వ‌రి 3) నుంచి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోనున్నారు. 18 ఏండ్లు నిండ‌ని అమ్మాయిల‌ను పెళ్లి చేసుకున్నా, ఈ వివాహాల్లో పాలుపంచుకున్న […]

  • రాష్ట్ర ముఖ్య‌మంత్రి హిమాంత బిశ్వ శ‌ర్మ కీల‌క నిర్ణ‌యం

విధాత‌: బాల్య వివాహాల‌ను నిర్మూలించేందుకు అసోం ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అసోం వ్యాప్తంగా మాతాశిశు మ‌ర‌ణాల రేటు రోజురోజుకు పెరిగి పోతుండటంతో.. బాల్య వివాహాల‌పై ఉక్కుపాదం మోపాల‌ని ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి హిమాంత బిశ్వ శ‌ర్మ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. బాల్య వివాహాల‌ను నిర్మూలించేందుకు శుక్ర‌వారం(ఫిబ్ర‌వ‌రి 3) నుంచి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోనున్నారు.

18 ఏండ్లు నిండ‌ని అమ్మాయిల‌ను పెళ్లి చేసుకున్నా, ఈ వివాహాల్లో పాలుపంచుకున్న వారిని రేప‌ట్నుంచి అరెస్టు చేస్తామ‌ని సీఎం తేల్చిచెప్పారు. బాల్య వివాహాల‌ను ప్రోత్స‌హించే ప్ర‌స‌క్తే లేద‌న్నారు. 18 ఏండ్లు నిండ‌ని బాలిక‌ల‌ను ఇప్ప‌టికే పెళ్లి చేసుకున్న వారుంటే.. అలాంటి వారిని రాబోయే ఆరేడు రోజుల్లో అరెస్టు చేస్తామ‌ని చెప్పారు.

ఇక 14 ఏండ్ల లోపు అమ్మాయిల‌ను వివాహామాడిన వారిపై పోక్సో చ‌ట్టం కింద కేసులు న‌మోదు చేస్తామ‌ని సీఎం హెచ్చ‌రించారు. బాల్య వివాహాల‌ను నిర్మూలించేందుకు ప్ర‌భుత్వం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని, ఇందుకు ప్ర‌జ‌లు కూడా స‌హ‌క‌రించాల‌ని సీఎం విజ్ఞ‌ప్తి చేశారు. ఇప్ప‌టికే బాల్య‌వివాహాల‌పై అసోం వ్యాప్తంగా 4,004 కేసులు న‌మోదు అయ్యాయి. అసోంలోని ధుబ్రి జిల్లాలో అత్య‌ధికంగా 370 చైల్డ్ మ్యారేజ్ కేసులు న‌మోదు అయ్యాయి.

Updated On 2 Feb 2023 1:15 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story