విధాత : క్రికెట్ అనగానే గుర్తొచ్చేది కామెంట‌రీ. ప్లేయ‌ర్లు మ్యాచ్ ఆడుతున్న సంద‌ర్భంగా.. వారు ఆడుతున్న ఆట‌కు అనుగుణంగా కామెంట‌రీ చ‌దువుతారు. ఆ కామెంట‌రీ కూడా వినసొంపుగా ఉంటుంది. క్రికెట్ అభిమానుల‌ను, శ్రోత‌ల‌ను ఆక‌ట్టుకునే విధంగా ఆ కామెంట‌రీ ఉంటుంది. సంద‌ర్భానుసారంగా లో పిచ్, హై పిచ్‌లో కామెంట‌రీ చ‌దివి అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంటారు. అలా ఇంగ్లీష్‌, హిందీ భాష‌ల‌తో పాటు ప్రాంతీయ భాష‌ల్లో క్రికెట్ కామెంట‌రీ చ‌ద‌వ‌డం చూశాం. కానీ మీరు ఎప్పుడు కూడా సంస్కృత […]

విధాత : క్రికెట్ అనగానే గుర్తొచ్చేది కామెంట‌రీ. ప్లేయ‌ర్లు మ్యాచ్ ఆడుతున్న సంద‌ర్భంగా.. వారు ఆడుతున్న ఆట‌కు అనుగుణంగా కామెంట‌రీ చ‌దువుతారు. ఆ కామెంట‌రీ కూడా వినసొంపుగా ఉంటుంది. క్రికెట్ అభిమానుల‌ను, శ్రోత‌ల‌ను ఆక‌ట్టుకునే విధంగా ఆ కామెంట‌రీ ఉంటుంది. సంద‌ర్భానుసారంగా లో పిచ్, హై పిచ్‌లో కామెంట‌రీ చ‌దివి అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంటారు. అలా ఇంగ్లీష్‌, హిందీ భాష‌ల‌తో పాటు ప్రాంతీయ భాష‌ల్లో క్రికెట్ కామెంట‌రీ చ‌ద‌వ‌డం చూశాం. కానీ మీరు ఎప్పుడు కూడా సంస్కృత భాష‌లో క్రికెట్ కామెంట‌రీ విని ఉండ‌రు.

అయితే ఓ యువ‌కుడు సంస్కృతంలో క్రికెట్ కామెంట‌రీ చేసిన ప్ర‌య‌త్నం అద్భుతంగా సక్సెస్ అయింది. ఆ కామెంట‌రీ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది. గ‌ల్లీలో క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న సంద‌ర్భంగా.. సంస్కృతంలో కామెంట‌రీ చ‌దివి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. ఇంగ్లీష్, హిందీ భాష‌లో అల‌వోక‌గా కామెంట‌రీ చెప్పిన‌ట్లే సంస్కృత భాష‌లో చెప్పి వైర‌ల్ అవుతున్నాడు. ఈ కామెంట‌రీ వీడియోను ల‌క్ష్మీ నారాయ‌ణ బీఎస్ అనే వ్య‌క్తి త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశారు. సంస్కృతం, క్రికెట్ అని క్యాప్ష‌న్ ఇచ్చాడు. 1,33,000 మంది వీక్షించ‌గా, 6,600 మంది లైక్ చేశారు.

ఇప్ప‌టి వ‌ర‌కు తాము సంస్కృతంలో క్రికెట్ కామెంట‌రీ విన‌లేద‌ని, అద్భుతంగా ఉంద‌ని ఓ నెటిజ‌న్ ప్ర‌శంసించాడు. మ‌రో యువ‌కుడు స్పందిస్తూ.. చాలా బాగుంది.. ప్ర‌తి ఒక్క‌రూ సంస్కృతంలో కామెంట‌రీ చెప్పేందుకు య‌త్నించండి అని రాసుకొచ్చాడు. అంత‌ర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల సంద‌ర్భంగా సంస్కృతంలో కామెంట‌రీ చెప్పాల‌ని మ‌రో నెటిజ‌న్ కోరాడు.

Updated On 4 Oct 2022 4:38 AM GMT
subbareddy

subbareddy

Next Story