Crocodile |
అమెరికాలోని సౌత్ కరోలినాలో రోడ్డుపై అనుకోని అతిథి రాకతో కాసేపు జనంలో టెన్షన్ నెలకొన్నది. నీళ్లలో, చెరువులు, నదుల ఒడ్డున కనిపించే భారీ మొసలి ఒకటి.. ఉన్నట్టుండి రోడ్డు మీదకు వచ్చింది.
కానీ.. సైజులో డైనోసార్‌ను తలపించిన ఈ మొసలిని చూసి.. ఒకరు ‘అదిగో చూడు.. అదొక డైనోసార్’ అంటూ వ్యాఖ్యానించడం ఆ వీడియోలో వినిపిస్తుంది.
రాచఠీవితో మెల్లగా నడుచుకుంటూ మొసలి రోడ్డు దాటుతున్న దృశ్యాన్ని థెరెస్సా ఫిక్కా అనే యూజర్ వీడియో రికార్డు చేసి.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తే.. జనాలు పోటీలు పడి మరీ కామెంట్లు పెట్టారు.
చాలా మంది దాని సైజు గురించే మాట్లాడారు. కొందరేమో ఇది జతకట్టే సమయం కావడంతో భాగస్వామి కోసం వెతుకుతున్నదేమో అని సందేహం వ్యక్తం చేశారు.
ఆ నడకలో రాజసం ఉట్టిపడుతున్నదని కొందరు వ్యాఖ్యానిస్తే.. దాని గొంతులో ఏదో అడ్డుపడినట్టు ఉన్నదని మరికొందరు రాశారు. చివరకు ఆ మొసలి.. రోడ్డుపైనే సేదదీరుతూ పడుకున్నది. మరి తర్వాత ఏమైందో తెలియదు!