Cheetah | Kuno National Park మ‌ధ్య‌ప్ర‌దేశ్ షియోపూర్‌లోని కునో నేష‌న‌ల్ పార్కులో చీతా మృత్యువాత ప‌డింది. ఆడ చిరుత జ్వాలకు జన్మించిన పిల్లల్లో ఒకటి మృతి చెందినట్లు కునో ఫారెస్ట్ ఆఫీస‌ర్ వెల్ల‌డించారు. ఇప్ప‌టికే కునో నేష‌న‌ల్ పార్కులో మూడు చీతాలు మృత్యువాత ప‌డిన సంగ‌తి తెలిసిందే. షాషా, ఉద‌య్ అనే చీతాలు మార్చి 27, ఏప్రిల్ 23న మృతి చెంద‌గా, ద‌క్ష అనే చీతా మే 9వ తేదీన మృత్యువాత ప‌డింది. మార్చి నెల‌లో షాషా […]

Cheetah | Kuno National Park

మ‌ధ్య‌ప్ర‌దేశ్ షియోపూర్‌లోని కునో నేష‌న‌ల్ పార్కులో చీతా మృత్యువాత ప‌డింది. ఆడ చిరుత జ్వాలకు జన్మించిన పిల్లల్లో ఒకటి మృతి చెందినట్లు కునో ఫారెస్ట్ ఆఫీస‌ర్ వెల్ల‌డించారు.

ఇప్ప‌టికే కునో నేష‌న‌ల్ పార్కులో మూడు చీతాలు మృత్యువాత ప‌డిన సంగ‌తి తెలిసిందే. షాషా, ఉద‌య్ అనే చీతాలు మార్చి 27, ఏప్రిల్ 23న మృతి చెంద‌గా, ద‌క్ష అనే చీతా మే 9వ తేదీన మృత్యువాత ప‌డింది.

మార్చి నెల‌లో షాషా అనే న‌మీబీయ‌న్ చీతా కిడ్నీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ చ‌నిపోయిన విష‌యం విదిత‌మే. న‌మీబీయా నుంచి మ‌ధ్య‌ప్ర‌దేశ్ కునో నేష‌న‌ల్ పార్కుకు తీసుకొచ్చిన ఎనిమిది చీతాల్లో షాషా ఒక‌టి.

షాషా డీహైడ్రేట్‌కు గురి కావ‌డం, క్రియాటిన్ లెవ‌ల్ పెర‌గ‌డంతో కిడ్నీ ఫంక్ష‌న్ స‌రిగ్గా జ‌ర‌గ‌క‌.. చ‌నిపోయిన‌ట్లు అధికారులు ధృవీక‌రించారు.

ఉద‌య్, ద‌క్ష అనే మ‌రో రెండు చిరుత‌లు కూడా మ‌ర‌ణించాయి. మొత్తంగా కునో నేష‌న‌ల్ పార్కులో ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు చీతాలు మ‌ర‌ణించగా, కూన‌ల సంఖ్య మూడుకు త‌గ్గింది.

Updated On 25 May 2023 4:47 AM GMT
subbareddy

subbareddy

Next Story