CWC 4 సీఎంలతో పాటు ముఖ్యనేతలంతా హాజరు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే విధాత: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) చాలా ఏళ్ల తరువాత ఢిల్లీ వెలుపల జరుగుతోంది. తాము ఇచ్చిన తెలంగాణలోనే సీడబ్ల్యుసీ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించిన జాతీయ కాంగ్రెస్ ఇందుకు హైదరాబాద్‌ను వేదికగా చేసుకున్నది. హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ యూనియన్‌లో కలిపిన రోజు కలిసి వచ్చే విధంగా 16,17 తేదీలలో సీడబ్ల్యుసీ నిర్వహిస్తున్నది. అలాగే కాంగ్రెస్ పార్టీ విజయం […]

CWC
- 4 సీఎంలతో పాటు ముఖ్యనేతలంతా హాజరు
- ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే
విధాత: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) చాలా ఏళ్ల తరువాత ఢిల్లీ వెలుపల జరుగుతోంది. తాము ఇచ్చిన తెలంగాణలోనే సీడబ్ల్యుసీ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించిన జాతీయ కాంగ్రెస్ ఇందుకు హైదరాబాద్‌ను వేదికగా చేసుకున్నది. హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ యూనియన్‌లో కలిపిన రోజు కలిసి వచ్చే విధంగా 16,17 తేదీలలో సీడబ్ల్యుసీ నిర్వహిస్తున్నది. అలాగే కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పేందుకు నిర్వహించే సభకు కూడా విజయ భేరీగా నామకరణం చేశారు.
మరి కొద్ది సేపట్లో ప్రారరంభమయ్యే ఈ సమావేశాల్లో తెలంగాణతో పాటువచ్చే ఐదు అసెంబ్లీ రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించడం లక్ష్యంగా ఎన్నికల ప్రణాళికలను రూపొందించనున్నారు. ముఖ్యంగా తెలంగాణలో బీఆరెస్ ప్రభుత్వాన్ని గద్దెదింపడమే ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్ కసరత్తుచేస్తుందని నాయకులు చెపుతున్నారు.
ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జన ఖర్గే అధ్యక్షత వహించే ఈ సమావేశానికి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. సోనియా గాంధీ, రాహజ్ఞుల్ గాంధీలు కూడా హాజరు కానున్నారు. మొత్తం 90 మంది అహ్వానితుల్లో నలుగురు సిట్టింగ్ ముఖ్యమంత్రులతో సహా 84 మంది హాజరైనట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పీటీఐకి తెలిపారు.
