HomelatestCyclone Mocha | తెలుగు రాష్ట్రాల‌కు పొంచి ఉన్న 'మోచా' తుఫాను ముప్పు.. !

Cyclone Mocha | తెలుగు రాష్ట్రాల‌కు పొంచి ఉన్న ‘మోచా’ తుఫాను ముప్పు.. !

Cyclone Mocha |

ఇటు తెలంగాణ‌, అటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో గ‌త నాలుగైదు రోజుల నుంచి వ‌ర్షాలు విస్తారంగా కురుస్తున్న సంగ‌తి తెలిసిందే. భారీ వ‌ర్షాల‌కు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు, రైతులు అత‌లాకుత‌లం అవుతున్నారు. భారీగా పంట న‌ష్టం జ‌ర‌గ‌డంతో రైతులు ఆందోళ‌న చెందుతున్నారు.

అయితే మ‌ళ్లీ పిడుగులాంటి వార్త‌ను వాతావ‌ర‌ణ శాఖ ప్ర‌క‌టించింది. మే 6వ తేదీన బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. దీని ఫ‌లితంగా వ‌చ్చే 48 గంట‌ల్లో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.

బంగాళాఖాతంలో తుఫాను ఏర్ప‌డుతుంద‌ని అమెరికా వాతావ‌ర‌ణ అంచ‌నా వ్య‌వ‌స్థ గ్లోబ‌ల్ వెద‌ర్ ఫోర్‌కాస్ట్ సిస్ట‌మ్‌, యూరోపియ‌న్ సెంట‌ర్ ఫ‌ర్ మీడియం రేంజ్ వెద‌ర్ ఫోర్‌కాస్ట్‌లు అంచ‌నా వేసిన త‌ర్వాత‌నే ఐఎండీ ఈ ప్ర‌క‌టన చేసింది. అయితే ఈ తుఫానుకు మోచా అని నామ‌క‌ర‌ణం చేసింది ఐఎండీ. మోచా అనేది ఎర్ర స‌ముద్రం తీరంలోని ఓడ‌రేవు న‌గ‌రం పేరు.

తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు ఒడిశా ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాక్ వెల్ల‌డించారు. మోచా తుఫానుపై సీఎం ప‌ట్నాయ‌క్ ఉన్న‌త‌స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు. ఎలాంటి ప‌రిస్థితుల‌నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల‌ని అధికారులను సీఎం ఆదేశించారు.

అయితే మోచా తుఫాను ప్ర‌భావం ఒడిశాతో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌పై కూడా చూప‌నుంది. హైద‌రాబాద్‌లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. తుఫాను హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు సూచించారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular