మేష రాశి: ఇతరులకు నష్టం కలిగించే పనులకు దూరంగా వుండండి. బంధుమిత్రుల వలన మోసపోవటం అశాంతి కలిగిస్తుంది. చేయవలసిన పనులు వాయిదా పడుతుంటాయి. వృథా ధన వ్యయము కలుగవచ్చును.
వృషభ రాశి: సంభాషణలు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన పనులను ఆరంభిస్తారు. బంగారు వస్తువులు సంగ్రహిస్తారు. ఆత్మస్థైర్యమంతో వివాదాలను పరిష్కరించుకుంటారు. వృత్తి మూలకంగా ధన లాభము సంతోషాన్నిస్తుంది.
మిథున రాశి: వ్యసనాల మూలకంగా అశాంతి కలుగవచ్చును. స్థిరాస్థి మూలకక అశాంతి కలుగవచ్చును. వృతి, ఉద్యోగాలలో అవరోధాలు ఏర్పడతాయి. ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది.
కర్కాటక రాశి: పెద్దలపై గౌరవాన్ని కలిగి ఉంటారు. నూతన వస్తు లాభములు కలుగుతాయి. ఉద్యోగస్థులకు శుభములు కలుగుతాయి. స్థిరాస్థి కొనుగోలు ప్రయత్నములు ఫలిస్తాయి.
సింహ రాశి: కుటుంబ మూలక అశాంతి ఏర్పడతుంది. ప్రయణ మూలక బాధలు కలుగవచ్చును. తీవ్ర కోపము వలన అవానములు ఎదురౌతాయి. సహచరులపై ద్వేషం పనికిరాదు.
కన్యా రాశి: బంధుమిత్రుల ఆదరణ సంతోషాన్నిస్తుంది. అప్రయత్నంగానే మీపై అపవాదులు తొలిగి పోతాయి. ప్రయత్న కార్యములన్ని దిగ్విజయంగా పూర్తవుతాయి. శుభ కార్యాలకు ధనం వెచ్చిస్తారు.
తులా రాశి: సోదరులతో అభిప్రాయ భేదాలు కలుగవచ్చును. అకారణ కలహములేర్పడవచ్చును. ఋణ మూలక అశాంతి వుంటుంది. శతృ బాధలు వుంటాయి. ధనాభావము బాధిస్తుంది.
వృశ్చిక రాశి: సత్ప్రవర్తన కలిగి వుంటారు. బుద్ధి కుశలత వలన శత్రువులను జయిస్తారు. భూ, గృహలాభములుంటాయి. అధికారుల ఆవరణ లభిస్తుంది. మిత్రుల మూలకంగా శుభములు కలుగుతాయి.
ధనుస్సు రాశి: మీరు కోరుకున్న విధంగా పనులు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అభివృద్ది వుంటుంది. గొప్ప వ్యక్తులతో పరిచయములు సంతోషాన్నిస్తాయి. నష్ట ధన ప్రాప్తి కలుగుతుంది.
మకర రాశి: సంఘంలో మీ మాట చెల్లు బాటవుతుంది. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. అనారోగ్య బాధలు ఉపశమిస్తాయి. శుభకార్యాచరణ వుంటుంది.
కుంభ రాశి: నూతన వస్త్ర లాభములుంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగులు కార్యనిర్వహణా దక్షతను ప్రదర్శిస్తారు. భోజన సౌర్యము లభిస్తుంది. ధన ప్రాప్తి కలుగుతుంది.
మీన రాశి: ఉద్రేకాన్ని అదుపులో ఉంచుకోండి. స్థిరాస్థి మూలక వివాదాలు అశాంతిని కలిగిస్తాయి. వస్తు నష్టములు ఆందోళన కలిగిస్తాయి. అవమానములు ఎదురు కావచ్చును. ధన వ్యయము ఎక్కువౌతుంది.