Wednesday, March 29, 2023
More
    Homelatest09. 03. 2023 గురువారం రాశి ఫ‌లాలు.. ఈ రాశి వారికి ఆకస్మాత్తుగా ధన ప్రాప్తి...

    09. 03. 2023 గురువారం రాశి ఫ‌లాలు.. ఈ రాశి వారికి ఆకస్మాత్తుగా ధన ప్రాప్తి కలుగుతుంది

    మేష రాశి: మాటకు కట్టుబడి ఉండవలసి వస్తుంది. శుభకార్యాచరణము చేస్తారు. సోదరులు సహకరిస్తారు. పాత విషయాలను తెలుసుకుంటారు. బంధు మూలక‌ లాభము వుంటుంది.

    వృష‌భ రాశి: తల్లిదండ్రుల అనారోగ్యం అశాంతి కలిగిస్తుంది. విలువైన వస్తువులును నష్టపోతారు. వృత్తి, ఉద్యోగాలలో అశాంతి కలుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. పుణ్యక్షేత్ర సందర్శనం ఆనందాన్నిస్తుంది.

    మిథున రాశి: బంధుమిత్రులతో విభేదాలు రావచ్చును. మోసగాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. వృత్తిరీత్యా అధిక సంచారములుండవచ్చును. ప్రయత్న కార్య భంగములు కలుగవచ్చును. శరీరబాధలు కలుగవచ్చును.

    కర్కాటక రాశి: రాజకీయ నేత‌లు మంత్రాంగం ఫలిస్తుంది. ఉన్నత స్థానంలో వున్న వ్యక్తులతో కలయికలు సంతోషాన్నిస్తాయి. ఋణ బాధలు తొలగిపోతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరాలకు సరిపడా ధనాదాయం వుంటుంది.

    సింహ రాశి: కుటుంబములో అకారణ కలహములుండవచ్చును. దుర్వార్తా శ్రవణము కలుగుతుంది. నిద్రా సౌఖ్యము తక్కువగా వుంటుంది. గతంలో చేసిన పొరపాట్లు బాధిస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి.

    కన్యా రాశి: శరీర సౌఖ్యము ఉత్సాహాన్నిస్తుంది. వేగవంతమైన ఆలోచనలు చేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేస్తారు. నూతన వస్త్ర లాభములుంటాయి. శుభ కార్యాచరణ చేస్తారు.

    తులా రాశి: అధిక ధనవ్యయము ఆందోళన కలిగిస్తుంది. సంతానములక అశాంతి కలుగవచ్చును. అతి నిద్ర వలన ఇబ్బంది పడతారు. వివాహ ప్రయత్నాలలో ఆలస్యం చికాకు తెప్పిస్తుంది. భోజన సౌఖ్యము తక్కువ.

    వృశ్చిక రాశి: ప్రభుత్వ ఉద్యోగులు కొత్త బాధ్యతలు నిర్వహించాల్సి వస్తుంది. సంతాన మూలకంగా సౌఖ్యం లభిస్తుంది. ఇంట్లో శుభాకార్యములు ఆచరిస్తారు. ఆకస్మాత్తుగా ధన ప్రాప్తి కలుగుతుంది.

    ధనుస్సు రాశి: ప్రయాణ మూలక లాభములుంటాయి. నూతన వస్తువులను సంగ్రహిస్తారు. పట్టుదలతో కార్యసిద్ధి కలుగుతుంది. మీరు కోరుకున్న పనులను పూర్తి చేస్తారు. నష్ట ధన ప్రాప్తి కలుగుతుంది.

    మకర రాశి: విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. వృత్తి, ఉద్యోగముల మూలకంగా నష్టములు కలుగవచ్చును. నూతన వ్యక్తులతో అకారణ కలహములేర్పడతాయి. ఆలోచనలను అదుపులో ఉంచుకోండి.

    కుంభ రాశి: మతిమరుపు ఎక్కువవుతుంది. శరీర బాధల మూలకంగా పనులు వాయిదా వేయవలసి వస్తుంది. శత్రువులతో కొత్త విభేదాలు ఏర్పడతాయి. బంధుమిత్రుల ఆదరణ తక్కువగా వుంటుంది.

    మీన రాశి: పాత మిత్రుల కలయిక ఆనందాన్నిస్తుంది. అక్కాచెల్లెళ్ళతో సంభాషణలు ఆనందాన్నిస్తాయి. కార్య నిర్వహణలో చాకచక్యాన్ని ప్రదర్శిస్తారు. విందు, వినోదములలో పాల్గొంటారు.

    – తూండ్ల కమలాకర శర్మ సిద్ధాంతి,
    కూకట్‌పల్లి, హైదరాబాద్
    ఫోన్‌ నంబర్‌ : +91 99490 11332.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular