Dalit Man | ఈ స‌మాజంలో ప్ర‌తి ఒక్క‌రూ గౌర‌వంగా బ‌త‌కాల‌ని కోరుకుంటారు. ఓ ద‌ళిత యువ‌కుడు కూడా డిగ్నిటీగా ఉండాల‌నే ఉద్దేశంతో మంచి దుస్తులు ధ‌రించాడు. ఎండ‌లు తీవ్రంగా ఉన్న నేప‌థ్యంలో స‌న్ గ్లాసెస్ కూడా ధ‌రించాడు. మంచి దుస్తులు, స‌న్ గ్లాసెస్ ధ‌రించ‌డ‌మే ఆ యువ‌కుడు చేసిన పాపం. త‌మ కంటే మంచి బ‌ట్ట‌లు ధ‌రిస్తావా..? అని ప్ర‌శ్నిస్తూ అగ్ర కులాల‌కు చెందిన కొంత‌మంది యువ‌కులు ద‌ళితుడిపై పాశవికంగా దాడి చేశారు. ఈ ఘ‌ట‌న […]

Dalit Man | ఈ స‌మాజంలో ప్ర‌తి ఒక్క‌రూ గౌర‌వంగా బ‌త‌కాల‌ని కోరుకుంటారు. ఓ ద‌ళిత యువ‌కుడు కూడా డిగ్నిటీగా ఉండాల‌నే ఉద్దేశంతో మంచి దుస్తులు ధ‌రించాడు. ఎండ‌లు తీవ్రంగా ఉన్న నేప‌థ్యంలో స‌న్ గ్లాసెస్ కూడా ధ‌రించాడు.

మంచి దుస్తులు, స‌న్ గ్లాసెస్ ధ‌రించ‌డ‌మే ఆ యువ‌కుడు చేసిన పాపం. త‌మ కంటే మంచి బ‌ట్ట‌లు ధ‌రిస్తావా..? అని ప్ర‌శ్నిస్తూ అగ్ర కులాల‌కు చెందిన కొంత‌మంది యువ‌కులు ద‌ళితుడిపై పాశవికంగా దాడి చేశారు. ఈ ఘ‌ట‌న గుజ‌రాత్‌లోని బ‌న‌స్కాంత జిల్లాలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. బ‌న‌స్కాంత గ్రామానికి చెందిన చెందిన ఓ ద‌ళిత యువ‌కుడు మే 30వ తేదీన మంచి బ‌ట్ట‌లు వేసుకున్నాడు. ఇక స‌న్ గ్లాసెస్ కూడా ధ‌రించి బ‌జార్లోకి వ‌చ్చాడు. అత‌న్ని చూసి అగ్ర కుల‌స్తులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

మంచి దుస్తులు ఎందుకు ధ‌రించావ‌ని ప్ర‌శ్నించారు. అంత‌టితో ఆగ‌కుండా అత‌నిపై ఏడుగురు వ్య‌క్తులు దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిచారు. చంపేస్తామ‌ని బెదిరించారు. స‌మాచారం అందుకున్న త‌ల్లి.. హుటాహుటిన అక్క‌డికి చేరుకుని వారిని అడ్డుకోబోయింది. ఆమెపై కూడా దాడి చేశారు.

అగ్ర కుల‌స్తుల యువ‌కుల దాడిలో గాయ‌ప‌డ్డ త‌ల్లీకుమారుడు ఆస్ప‌త్రిలో చేరారు. ప్ర‌స్తుతం వారి ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంది. బాధిత వ్య‌క్తుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదు చేశారు. కానీ పోలీసులు ఏ ఒక్క‌రిని అరెస్టు చేయ‌లేదు.

Updated On 2 Jun 2023 4:18 AM GMT
subbareddy

subbareddy

Next Story