Dalit Woman | లక్నో: ఓ దళిత యువతి పట్ల ఇద్దరు ముస్లిం యువకులు క్రూరంగా ప్రవర్తించారు. మత్తు మందు ఇచ్చి బలవంతంగా బీఫ్ తినిపించి, సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. బరేలి జిల్లాకు చెందిన ఓ దళిత యువతి.. తన స్నేహితురాలైన ముస్లిం మహిళ నుంచి కొంత డబ్బు అప్పుగా తీసుకుంది. ఆ డబ్బు తిరిగి చెల్లించాలని ముస్లిం మహిళ దళిత యువతిని […]

Dalit Woman |
లక్నో: ఓ దళిత యువతి పట్ల ఇద్దరు ముస్లిం యువకులు క్రూరంగా ప్రవర్తించారు. మత్తు మందు ఇచ్చి బలవంతంగా బీఫ్ తినిపించి, సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. బరేలి జిల్లాకు చెందిన ఓ దళిత యువతి.. తన స్నేహితురాలైన ముస్లిం మహిళ నుంచి కొంత డబ్బు అప్పుగా తీసుకుంది. ఆ డబ్బు తిరిగి చెల్లించాలని ముస్లిం మహిళ దళిత యువతిని అడిగింది. దీంతో సెప్టెంబర్ 2వ తేదీన ముస్లిం స్నేహితురాలు పిలిచిన ప్రాంతానికి యువతి వెళ్లింది. ఓ హోటల్ గదిలో ముస్లిం మహిళతో పాటు మరో ఇద్దరు యువకులు ఉన్నారు.
ఇక దళిత యువతికి మత్తు మందు ఇచ్చి బలవంతంగా బీఫ్ తినిపించారు. స్పృహ కోల్పోయిన ఆమెపై ఇద్దరు యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆమెను నగ్నంగా చిత్రీకరించారు. ఆ వీడియోలను అడ్డుగా పెట్టుకుని రూ. 5 లక్షలు డిమాండ్ చేశారు. నగ్న వీడియోలను యువతికి కాబోయే భర్తకు కూడా పంపించారు.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులతో పాటు మహిళను కూడా అరెస్టు చేశారు. ఇద్దరు యువకులను సోహెబ్(బీ ఫార్మసీ స్టూడెంట్), నజీం(బార్బర్)గా గుర్తించారు పోలీసులు.
