Bumble | Dating | విధాత: ప్రేమ, పెళ్లిళ్లకు యువతీ యువకుల మధ్య ఎంత వయసు తేడా ఉండాలనే విషయంలో ఎప్పట్నుంచో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉంటే ఆ జంట సంతోషంగా ఉండదని మన దేశంలో అందరూ భావిస్తుంటారు. అయితే మిలినీయల్స్ మాత్రం వేరే అభిప్రాయాలను కలిగి ఉన్నారని ఓ సర్వే వెల్లడించింది. ఎంత ఏజ్ గ్యాప్ ఉంటే ప్రేమికులు నిరుత్సాహ పడతారు? డేటింగ్‌లో(Dating) ఏజ్‌కు ఉన్న పాత్ర ఏంటి? ఒక […]

Bumble | Dating |
విధాత: ప్రేమ, పెళ్లిళ్లకు యువతీ యువకుల మధ్య ఎంత వయసు తేడా ఉండాలనే విషయంలో ఎప్పట్నుంచో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉంటే ఆ జంట సంతోషంగా ఉండదని మన దేశంలో అందరూ భావిస్తుంటారు. అయితే మిలినీయల్స్ మాత్రం వేరే అభిప్రాయాలను కలిగి ఉన్నారని ఓ సర్వే వెల్లడించింది.
ఎంత ఏజ్ గ్యాప్ ఉంటే ప్రేమికులు నిరుత్సాహ పడతారు? డేటింగ్‌లో(Dating) ఏజ్‌కు ఉన్న పాత్ర ఏంటి? ఒక వేళ ఏజ్ గ్యాప్ ఎంత ఉన్నా పర్లేదనే మాట కేవలం ధనవంతులకే సొంతమా అనే అంశాలపై బంబ్‌ల్ అనే సంస్థ సర్వే నిర్వహించింది.
ఆ నివేదిక ప్రకారం… ఎలాంటి ఇతర ఆలోచనా లేకుండా ఒకే ఆలోచనా ధోరణితో ఉన్న వ్యక్తి దొరికితే వారితోనే డేటింగ్‌కు అంగీకరిస్తున్నామని యువతీ యువకులు వెల్లడించారు. సర్వేలో పాల్గొన్న 81 శాతం మంది ప్రేమకు వయసుకు సంబంధం లేదనే అభిప్రాయాన్ని కలిగిఉన్నారు. అది ఒక నంబర్ మాత్రమేనని బంధం కలకాలం ఉండటానికి, ఏజ్‌కు సంబంధంలేదన్నారు.
గతంతో పోలిస్తే ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉన్నా.. డేటింగ్ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేసే వారి సంఖ్య 84 శాతం పెరిగింది. మరి కొంత మంది మాత్రం ఏజ్‌గ్యాప్ రిలేషన్‌షిప్స్ మొదట బాగానే ఉన్నా.. భాగస్వామి ఏజ్ పెరిగేకొద్దీ బంధం బలహీనపడుతుందని తెలిపారు. వయసు ఎక్కువున్న వారితో బంధంలోకి వెళ్లడానికి సమాజం, బంధువుల నుంచి వచ్చే వ్యతిరేకత అడ్డుగా నిలుస్తోందని 33 శాతం మంది పేర్కొన్నారు.
ఈ పరిస్థితి ఒంటరి మహిళలకు మరింత అవరోధంగా మారిందని సర్వే వెల్లడించింది. పితృస్వామ్య, సంప్రదాయవాద, సామాజిక ప్రతిబంధకాలను అధిగమించి ఏజ్ గ్యాప్ రిలేషన్‌షిప్‌లు ఏ మేరకు విజయవంతమవుతున్నాయో తెలుసుకోవాలనుకున్నామని సంస్థ ఇండియా డైరెక్టర్ సమర్పితా సమద్దర్ వెల్లడించారు. కుర్రాళ్లు .. పెద్ద వయసు మహిళలతో బంధంలోకి వెళితే.. అది కేవలం శారీరక అవసరాలు, డబ్బు కోసమే అనే ఆలోచన సమాజంలో ఉందని తెలిపారు.
