విధాత‌: తెలుగులో క్రియేటివ్ జీనియస్ అంటే డైరెక్టర్ కృష్ణవంశీ పేరు చెప్పుకోవాలి. ఆయన మొదట జెడి చక్రవర్తి, మహేశ్వరి జంటగా వచ్చిన గులాబీ చిత్రంతో దర్శకునిగా పరిచయమయ్యారు. ఈ చిత్రం క‌మ‌ర్షియ‌ల్‌గా కూడా మంచి విజ‌యం సాధించి రివార్డుల‌తో పాటు అవార్డుల‌ను కూడా సాధించింది. దీని తర్వాత ఆయన నిన్నే పెళ్ళాడతా వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తీశారు. ఇందులో ఏకంగా నాగార్జున, టబూ నటించారు. ఇక ఈయన మూడో చిత్రం విషయానికొస్తే ఆయన సొంతగా ఆంధ్ర […]

విధాత‌: తెలుగులో క్రియేటివ్ జీనియస్ అంటే డైరెక్టర్ కృష్ణవంశీ పేరు చెప్పుకోవాలి. ఆయన మొదట జెడి చక్రవర్తి, మహేశ్వరి జంటగా వచ్చిన గులాబీ చిత్రంతో దర్శకునిగా పరిచయమయ్యారు. ఈ చిత్రం క‌మ‌ర్షియ‌ల్‌గా కూడా మంచి విజ‌యం సాధించి రివార్డుల‌తో పాటు అవార్డుల‌ను కూడా సాధించింది.

దీని తర్వాత ఆయన నిన్నే పెళ్ళాడతా వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తీశారు. ఇందులో ఏకంగా నాగార్జున, టబూ నటించారు. ఇక ఈయన మూడో చిత్రం విషయానికొస్తే ఆయన సొంతగా ఆంధ్ర టాకీస్ అనే నిర్మాణ సంస్థను నెలకొల్పి న‌క్స‌లైట్లు, పోలీసుల మధ్య జరిగే భావోద్వేగ పోరాటాన్ని ‘సింధూరం’ అనే చిత్రంలో చూపించారు.

అత్యద్భుతమైన ఈ చిత్రం కమర్షియల్‌గా మాత్రం పెద్దగా సక్సెస్ రాలేదు. కానీ ఈ సినిమాకి జాతీయ స్థాయిలో ఉత్తమ చలనచిత్రంగా అవార్డు లభించింది. ఇలా నేషనల్ అవార్డు సంపాదించుకున్న సింధూరం చిత్రం 1997లో విడుదల అయింది.

ఈ చిత్రం ద్వారానే బ్రహ్మాజీ హీరోగా పరిచయం అయితే రవితేజ సపోర్టింగ్ హీరోగా మెప్పించి తన కెరీర్‌కు బాటలు వేసుకున్నాడు. ఇక ఇందులో సంఘవి హీరోయిన్‌గా నటించింది.

విషయానికి వస్తే ఇటీవల టాలీవుడ్‌లో రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఆయా హీరోల పుట్టినరోజుల్లో పాత సినిమాలను హై క్వాలిటీలో మరోసారి థియేటర్లలో విడుదల చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి రీరిలీజ్‌లో కూడా తన సత్తా చాటింది.

త్వరలో తొలిప్రేమ చిత్రాన్ని కూడా రీరిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక ఓ నెటిజన్ సోషల్ మీడియా వేదికగా కృష్ణవంశీని సింధూరం సినిమాను రీరిలీజ్ చేయాలని కోరాడు. ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్‌పై మళ్లీ చూడాలని ఉంది… అని అతను కోరాడు.

‘‘సార్ ఒక్కసారి సింధూరం సినిమాను రీరిలీజ్ చేయండి. నాలాంటి వాళ్ళు చాలామంది చూడడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి మా ఆశ నెరవేర్చాలని కోరుకుంటున్నామని’’ ట్వీట్ చేశారు.

దీనికి కృష్ణ‌వంశీ స్పందిస్తూ… ‘‘అమ్మో ఐదు సంవత్సరాలు అప్పులు కట్టానయ్యా వామ్మో’’ అంటూ దండం పెట్టేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇది సాదా సీదా సినిమా కాదు అని ఒకరంటే ఇప్పుడు రిలీజ్ చేయండి… సూపర్ హిట్ అవుతుందని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

కాగా ప్రస్తుతం కృష్ణవంశీ రంగమార్తాండ అనే చిత్రం తెర‌కెక్కిస్తున్నాడు. నట సామ్రాట్ అనే చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం చిరంజీవి చెప్పిన నేనొక నటుడిని షాయరీ అందర్నీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

Updated On 8 Jan 2023 6:36 AM GMT
krs

krs

Next Story