వామ్మో దీపికా.. ఆ ఆరబోత ఏంటి? విధాత: ప్రస్తుతం బాలీవుడ్‌లో ఖాన్ త్రయం మేనియా మెల్లిగా తగ్గుతోంది. షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లు ఫేడవుట్ అయ్యే దశలో ఉన్నారు. అందుకోసం ముందుపాటి లాగే తమ హవా సాగించడానికి ఎలాగైనా హిట్లు కొట్టడానికి దొడ్డిదారి వెతుకుంటున్నట్టు అనిపిస్తోంది. నిజానికి బాలీవుడ్‌లో బికినీ సాంగ్స్ అనేవి చాలా సహజం. అవేమీ కొత్త కాదు. ఒక్కో హీరోయిన్ ఒక్కో రేంజ్‌లో బికినీ షో చేసి హై రేంజ్‌లో గుర్తింపు […]

వామ్మో దీపికా.. ఆ ఆరబోత ఏంటి?

విధాత: ప్రస్తుతం బాలీవుడ్‌లో ఖాన్ త్రయం మేనియా మెల్లిగా తగ్గుతోంది. షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లు ఫేడవుట్ అయ్యే దశలో ఉన్నారు. అందుకోసం ముందుపాటి లాగే తమ హవా సాగించడానికి ఎలాగైనా హిట్లు కొట్టడానికి దొడ్డిదారి వెతుకుంటున్నట్టు అనిపిస్తోంది. నిజానికి బాలీవుడ్‌లో బికినీ సాంగ్స్ అనేవి చాలా సహజం. అవేమీ కొత్త కాదు. ఒక్కో హీరోయిన్ ఒక్కో రేంజ్‌లో బికినీ షో చేసి హై రేంజ్‌లో గుర్తింపు అందుకున్నారు.

గతంలో దీపికా పడుకొనే కూడా నెంబర్ వన్‌గా సాగుతూ కూడా పలు బికినీ సాంగ్స్ చేసింది. కానీ తాజాగా ‘పఠాన్’ సినిమాలో ఆమె చేసిన బికినీ సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అంతకుమించి అనేలా ఇది వైరల్ అవుతుంది. దీపికాకు జోడిగా షారుక్ సైతం ఎన్నడూ లేని రేంజ్‌లో ఘాటైన రొమాన్స్ పండించాడు. ఈ పాటలోని కొన్ని స్క్రీన్ షాట్స్ వైరల్ గా మారాయి.

షారుక్ ఖాన్ బాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ అనేది చూసి చాలాకాలం అయింది. అలాంటి స్థితిలో ఆయ‌న ఉన్నాడు. దాంతో ఈసారి ఎలాగైనా ‘పఠాన్’తో సక్సెస్ అందుకోవాలని తన సీనియార్టీని కూడా మర్చిపోయాడు. ఈ సినిమాకు సంబంధించి టీజర్ కూడా ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ మూవీ యాక్షన్ మూవీగా రానుంది. షారుక్ ఇందులో సరికొత్త ఫిట్నెస్ తో కనిపిస్తున్నాడు.

వీటికి తోడు మరొక రేంజ్‌లో ఉండే విధంగా దీపిక అందాల ఆరబోత కూడా హైలైట్ కానుంది. ఈ మూవీలో బేషారం అల‌జ‌డి రేపుతోంది. ఇప్పుడు సాంగ్ విడుదల చేయడంతో ముందుగా అనుకున్నట్టుగానే ఒక విధంగా చెప్పాలంటే అంతకుమించి షారుక్ దీపికాలు ఇద్దరు దిమ్మతిరిగి పోయేలా కనిపించారు. ఇద్దరు రొమాన్స్‌తో అదరగొట్టారు. నువ్వా…నేనా అన్న‌ట్లు రొమాన్స్‌ను పండించారు. దీనికి రొమాన్స్ అనే పదం కూడా సరిపోదేమో.

గతంలో కూడా తన బికినీ షోలతో థియేటర్లకు ప్రేక్షకులను రప్పించిన దీపికా పడుకొనే మరింతగా ఈ మూవీలో ఈపాటలో రెచ్చిపోయింది. బీచ్‌లో వీరు పండించిన రొమాన్స్‌తో ఇంటర్నెట్ షేక్ అవుతోంది. ముఖ్యంగా కొన్ని షాట్స్‌లో అయితే దీపిక అందాలపై బహుశా పబ్లిక్ గా వేయడానికి ఎవ్వరు సాహసించని ప్రైవేటు భాగాలపై షారుక్ హ్యాండ్ వేసిన విధానం యూత్‌కు హీటెక్కిస్తుంటే.. నాటి తరం వారికి మాత్రం ఇదేమి విడ్డూరం అనిపిస్తోంది.

ఓ సినిమా హిట్ కోసం ఇంతగా దిగజారాలా అనిపించడం కూడా సహజమే. ఎవ్వ‌రూ ఈ పాటలో ఇంత రొమాన్స్‌ను ఊహించలేదు. అసలు దీపికాకు పెళ్లయిందా? పెళ్లయిన తర్వాత కూడా ఈ రేంజ్‌లో ఆరబోత ఏమిటో.. ఆమెకే తెలియాలి. ఇంకా చెప్పాలంటే.. అసలు ఓ గ్రాఫిక్స్ బొమ్మకు బట్టల్లేకుండా చూస్తే ఎలా ఉంటుందో.. ఈ పాటలో దీపికా అలా ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తుండటం విశేషం.

సాధారణంగా ఎలాంటి రొమాన్స్ అయినా నెటిజనులకు డోస్ త‌క్కువ‌గానే క‌నిపిస్తాయి. కానీ ఈ పాట చూసి మాత్రం నెటిజన్లు షాక‌వ్వ‌డంతో పాటు అవాక్క‌వుతున్నారు. అలాంటి కామెంట్లును వారు ఈ సాంగ్ చూసి పెడుతున్నారు. విశాల్ శేఖర్ సంగీతం అందించే ఈ చిత్రం య‌ష్‌రాజ్ ఫిల్మ్‌పై రూపొందుతుండ‌గా, సిద్ధార్థ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

ఇక ఈ మూవీలో సల్మాన్ ఖాన్ కూడా ఒక ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నాడు. 2023 జనవరి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న పటాన్ ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాలి…! ఈ చిత్రం ఏ స్థాయిలో హిట్టైనా ఆ క్రెడిట్ మాత్రం ఈ బికినీ సాంగ్‌కే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతగా ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా ఈ పాట చేస్తోంది.

Updated On 20 Jan 2023 7:39 AM GMT
krs

krs

Next Story