Deepika Padukone | బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ నటించిన చిత్రం జవాన్‌. ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకున్నది. ఇప్పటి వరకు దాదాపు రూ.700కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. ఇంతకు ముందు ‘పఠాన్‌’తో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన జవాన్‌ సైతం మంచి టాక్‌తో దూసుకుపోతున్నది. అట్లీ దర్శకత్వంలో ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించింది. అలాగే, బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొనే సైతం అతిథి […]

Deepika Padukone |

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ నటించిన చిత్రం జవాన్‌. ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకున్నది. ఇప్పటి వరకు దాదాపు రూ.700కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. ఇంతకు ముందు ‘పఠాన్‌’తో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన జవాన్‌ సైతం మంచి టాక్‌తో దూసుకుపోతున్నది.

అట్లీ దర్శకత్వంలో ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించింది. అలాగే, బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొనే సైతం అతిథి పాత్రలో మెరిసింది. అయితే, గెస్ట్‌ అప్పియరెన్స్‌లో కనిపించినందుకు దీపికా భారీగానే రెమ్యునరేషన్‌ తీసుకుందనే వార్తలు వచ్చాయి.

దాదాపు రూ.15కోట్ల వరకు వసూలు చేసినట్లు బాలీవుడ్‌లో ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తలను దీపికా ఖండించింది. జవాన్‌ సినిమాలో అతిథి పాత్రలో నటించేందుకు రూ.15కోట్లు తీసుకున్నానని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది.

సినిమాలో కనిపించినందుకు ఒక్క రూపాయి సైతం తీసుకోలేదని, కేవలం ఫ్రీగానే నటించాని చెప్పుకొచ్చింది. ఇక తన భర్త ‘83’ చిత్రానికి సైతం రెమ్యునరేషన్‌ తీసుకోలేదని, భర్త సినిమా విజయంలో భాగమయ్యేందుకే ఆ చిత్రంలో నటించానని తెలిపింది.

షారుఖ్ ఖాన్, అలాగే రోహిత్ శెట్టి సినిమాలకు తాను రెమ్యూనరేషన్ తీసుకోకుండా గెస్ట్‌ రోల్స్‌లో నటిస్తానని దీపిక చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉండగా.. జవాన్‌ చిత్రానికి అట్లీ కుమార్‌ దర్శకత్వం వహించగా.. పలువురు నటులు కీలక పాత్రలు పోషించారు.

విజయ్‌సేతుపతి, ప్రియమణి, యోగి బాబు, సంజీతా భట్టాచార్య, సన్యా మల్హోత్రా, గిరిజా ఓక్‌, ఆలియా ఖురేషి, రిధి డోగ్రా, సునీల్ గ్రోవర్, ముఖేష్ ఛబ్రా, ఇజాజ్ ఖాన్ సహాయక పాత్రల్లో కనిపించారు. మరో బాలీవుడ్‌ అగ్రనటుడు సంజయ్‌ దత్‌ సైతం అతిథి పాత్రలో నటించారు.

Updated On 17 Sep 2023 9:46 AM GMT
cm

cm

Next Story