విధాత: బాలీవుడ్ భామ దీపికా ప‌దుకొణె స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌కు గురైన‌ట్లు తెలుస్తోంది. సోమ‌వారం రాత్రి ఆమె ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్ప‌త్రికి వెళ్లిన‌ట్లు స‌మాచారం. అనారోగ్యం కార‌ణంగా దీపికా అన్ని ర‌కాల వైద్య ప‌రీక్ష‌లు చేయించుకున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ విష‌యాన్ని దీపికా కానీ, ఆమె స‌న్నిహితులు కానీ ఎవ‌రూ ధృవీక‌రించ‌లేదు. కేవ‌లం ఈ వార్త‌లు పింక్ విల్లాలో మాత్ర‌మే ప్ర‌చురిత‌మ‌య్యాయి. ఈ ఏడాది జూన్ నెల‌లో ప్రాజెక్ట్ కే షూటింగ్ నిమిత్తం ఆమె హైద‌రాబాద్‌కు వ‌చ్చారు. […]

విధాత: బాలీవుడ్ భామ దీపికా ప‌దుకొణె స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌కు గురైన‌ట్లు తెలుస్తోంది. సోమ‌వారం రాత్రి ఆమె ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్ప‌త్రికి వెళ్లిన‌ట్లు స‌మాచారం. అనారోగ్యం కార‌ణంగా దీపికా అన్ని ర‌కాల వైద్య ప‌రీక్ష‌లు చేయించుకున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ విష‌యాన్ని దీపికా కానీ, ఆమె స‌న్నిహితులు కానీ ఎవ‌రూ ధృవీక‌రించ‌లేదు. కేవ‌లం ఈ వార్త‌లు పింక్ విల్లాలో మాత్ర‌మే ప్ర‌చురిత‌మ‌య్యాయి.

ఈ ఏడాది జూన్ నెల‌లో ప్రాజెక్ట్ కే షూటింగ్ నిమిత్తం ఆమె హైద‌రాబాద్‌కు వ‌చ్చారు. ప్ర‌భాస్ స‌ర‌స‌న న‌టిస్తున్న దీపికాకు ఆ షూటింగ్ స‌మ‌యంలో హార్ట్ బీట్ పెర‌గ‌డంతో, కామినేని ఆస్ప‌త్రిలో చేరి వైద్యం చేయించుకున్నారు. తాజాగా మరోసారి ఆమె అనారోగ్యానికి గురైన‌ట్లు పింక్ విల్లా పేర్కొన్న‌ది. దీంతో ‘ప్రాజెక్ట్‌ K’ సినిమా కొద్దిగా ఆలస్యం అవ్వనుంది.

దీపికా ప‌దుకొణె ప్ర‌స్తుతం ప‌ఠాన్ సినిమాలో న‌టిస్తోంది. ఈ మూవీలో షారూఖ్ ఖాన్ హీరో. ఇక జాన్ అబ్ర‌హం కూడా కీల‌క పాత్ర పోషిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌తున్న ఈ చిత్రం జ‌న‌వ‌రి 25న విడుద‌ల కానుంది. ప‌ఠాన్ చిత్రం తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల్లో రిలీజ్ చేయ‌నున్నారు. ఇటీవ‌లే ఈ మూవీకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ మోష‌న్ పోస్ట‌ర్‌ను దీపికా త‌న ఇన్‌స్టా గ్రాంలో విడుద‌ల చేశారు.

Updated On 28 Sep 2022 2:23 AM GMT
subbareddy

subbareddy

Next Story