Deepthi Sunaina | యూట్యూబర్‌గా, షణ్ముఖ్ ప్రియురాలిగా మంచి క్రేజ్ సంపాదించుకుంది దీప్తి సునయన. సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు తన అభిమానులకి కావలసినంత వినోదం పంచుతుంది. ఎప్పటికప్పుడు తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే దీప్తి సునైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ నానా రచ్చ చేస్తుంది. దీప్తి సునయన గ్లామర్ పరంగా ఆకట్టుకోవడం, చలాకీగా ఉండడంతో యువతలో ఆమెకి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ అమ్మడు ఎప్పటికప్పుడు […]

Deepthi Sunaina |
యూట్యూబర్‌గా, షణ్ముఖ్ ప్రియురాలిగా మంచి క్రేజ్ సంపాదించుకుంది దీప్తి సునయన. సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు తన అభిమానులకి కావలసినంత వినోదం పంచుతుంది. ఎప్పటికప్పుడు తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే దీప్తి సునైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ నానా రచ్చ చేస్తుంది.
దీప్తి సునయన గ్లామర్ పరంగా ఆకట్టుకోవడం, చలాకీగా ఉండడంతో యువతలో ఆమెకి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ అమ్మడు ఎప్పటికప్పుడు తనలోని కొత్త అందాలని పరిచయం చేస్తూ యువతకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంటుంది. దీప్తి సునయన గ్లామర్‌కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
తాజాగా దీప్తి సునైనా గురించి ఒక షాకింగ్ న్యూస్ వైరల్ గా మారడంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. దీప్తి సునయనకి కార్ యాక్సిడెంట్ జరిగిందని కొందరు పోస్ట్‌లు పెట్టడంతో ఏం జరిగింది, ఎలా అయిందని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ఇక ఈ మేటర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో స్వయంగా దీప్తి సునైనా స్పందించింది.
తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తాను క్షేమంగా ఉన్నానని తెలియజేసింది. అలియా ఖాన్ అనే షార్ట్ ఫిలిం లో గతంలో నేను నటించగా, అందులో కారు యాక్సిడెంట్ దృశ్యాలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని వైరల్ చేస్తూ నాకు ప్రమాదం జరిగిందని ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారు. ఇలాంటి అసత్య ప్రచారాలతో ఎవరిని ఆందోళనకి గురి చేయవద్దు అంటూ దీప్తి సునయన పేర్కొంది.
ఇక అసత్య ప్రచారాలపై దీప్తి సునైనా క్లారిటీ ఇవ్వడంతో అవన్నీ పూర్తిగా ఫేక్ అని తేలిపోయింది. షణ్ముఖ్ తో కొంత కాలం ప్రేమాయణం నడిపిన దీప్తి సునయన ప్రస్తుతం సోలోగా ఉంటూ పలు వీడియోలు చేస్తుంది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడిపోవడానికి కారణం సిరి అనే చెప్పాలి.
షణ్ముఖ్ బిగ్ బాస్‌కి వెళ్లినప్పుడు ఆమెతో కలిసి తెగ హగ్గులు ఇచ్చుకుంటూ రొమాన్స్ చేసుకుంటూ నానా హంగామా సృష్టించారు. ఇది చూసిన దీప్తికి ఒళ్లు మండి షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పింది.ప్రస్తుతం తన కెరీర్‌పై
పూర్తి దృష్టి పెట్టింది ఈ ముద్దుగుమ్మ.
