Japan | జీబ్రా లైన్ మీదుగా రోడ్డు దాటిన డీర్.. జపాన్‌లో ఘటన సోషల్ మీడియాలో వీడియో వైరల్.. 7.7 మిలియన్ల వ్యూస్ విధాత: మనలో చాలా వరకు ట్రాఫిక్‌రూల్స్ పాటించం. ఎక్కడ పడితే అక్కడ రోడ్డు దాటుతం. వాహనాలకు అడ్డంగా కూడా నిర్లక్ష్యంగా వెళ్తుంటం. ప్రమాదాల బారిన పడుతుంటం. కానీ, ఇటీవల కొన్ని జంతువులు మాత్రం మనుషుల కంటే బాగా ట్రాఫిక్‌రూల్స్ పాటిస్తున్నయ్. ఆవులు కుక్కలు, పిల్లలు వాహనాలు రానప్పుడు రోడ్డు దాటున్నయ్. ఇందుకు సంబంధించిన […]

Japan |
- జీబ్రా లైన్ మీదుగా రోడ్డు దాటిన డీర్.. జపాన్‌లో ఘటన
- సోషల్ మీడియాలో వీడియో వైరల్.. 7.7 మిలియన్ల వ్యూస్
విధాత: మనలో చాలా వరకు ట్రాఫిక్‌రూల్స్ పాటించం. ఎక్కడ పడితే అక్కడ రోడ్డు దాటుతం. వాహనాలకు అడ్డంగా కూడా నిర్లక్ష్యంగా వెళ్తుంటం. ప్రమాదాల బారిన పడుతుంటం. కానీ, ఇటీవల కొన్ని జంతువులు మాత్రం మనుషుల కంటే బాగా ట్రాఫిక్‌రూల్స్ పాటిస్తున్నయ్. ఆవులు కుక్కలు, పిల్లలు వాహనాలు రానప్పుడు రోడ్డు దాటున్నయ్. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరలైన సంగతి తెలిసిందే.
A deer in Nara, Japan, patiently waits for traffic to halt before crossing🦌🚦
— Tansu YEĞEN (@TansuYegen) August 26, 2023
తాజాగా జపాన్‌లో ఓ జింక (డీర్) ట్రాఫిక్‌రూల్స్ పాటించింది. వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న రోడ్డు దాటేందుకు రోడ్డు పక్కన నిలబడింది. వాహనాలు లేనప్పుడు రోడ్డు దాటింది. అది కూడా ఎక్కడ పడితే కాదు జీబ్రా లైన్స్ మీదుగా రోడ్డు దాటింది.
దీనిని గమనించి ఒకరు వీడియో తీసి సోషల్‌మీడియాలో ఈ నెల 26న షేర్ చేయగా, వైరల్‌గా మారింది. కేవలం ఒక్క రోజులోనే 7.7 మిలియన్ల మంది వీడియోను వీక్షించారు. పలువురు నెటిజన్లు వీడియోపై కామెంట్లు చేశారు. జంతువులకు ఉన్న బుద్ధి జనాలకు లేదని వ్యాఖ్యానించారు.
