విధాతఐ ఢిల్లీ పోలీసులు ఎమ్మెల్సీ క‌విత‌కు భారీ షాకిచ్చారు. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల బిల్లు కోసం ఒక్క‌రోజు నిరాహార దీక్ష చేప‌ట్ట‌నున్న క‌వితకు ఢిల్లీ పోలీసులు ష‌ర‌తులు విధించారు. రేపు చేప‌ట్ట‌బోయే దీక్ష‌కు జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద స‌గం స్థ‌లం మాత్ర‌మే వాడుకోవాల‌ని ఆమెకు ఢిల్లీ పోలీసులు సూచించారు. ఈ క్ర‌మంలో ప్రెస్ మీట్ అయిపోగానే క‌విత నేరుగా జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద‌కు వెళ్లి దీక్ష ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. క‌విత ప్రెస్‌మీట్‌లో ఉండ‌గానే ఆమెకు ఈ స‌మాచారం అందింది. దీంతో […]

విధాతఐ ఢిల్లీ పోలీసులు ఎమ్మెల్సీ క‌విత‌కు భారీ షాకిచ్చారు. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల బిల్లు కోసం ఒక్క‌రోజు నిరాహార దీక్ష చేప‌ట్ట‌నున్న క‌వితకు ఢిల్లీ పోలీసులు ష‌ర‌తులు విధించారు. రేపు చేప‌ట్ట‌బోయే దీక్ష‌కు జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద స‌గం స్థ‌లం మాత్ర‌మే వాడుకోవాల‌ని ఆమెకు ఢిల్లీ పోలీసులు సూచించారు.

ఈ క్ర‌మంలో ప్రెస్ మీట్ అయిపోగానే క‌విత నేరుగా జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద‌కు వెళ్లి దీక్ష ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. క‌విత ప్రెస్‌మీట్‌లో ఉండ‌గానే ఆమెకు ఈ స‌మాచారం అందింది. దీంతో ఆమె కాస్త అస‌హ‌నానికి గురైంది. ముందు అనుమ‌తిచ్చి త‌ర్వాత ఎలా ర‌ద్దు చేస్తార‌ని క‌విత ప్ర‌శ్నించారు. త‌మ దీక్ష‌లో మార్పు లేదు.. కొన‌సాగుతుంద‌ని క‌విత స్ప‌ష్టం చేశారు.

కాగా.. మహిళా రిజర్వేషన్‌ బిల్లు పెట్టి ఆమోదించాలనేది తమ ప్రధాన డిమాండ్‌ అని కవిత అన్నారు. 27 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం పోరాటం చేస్తున్నారని.. ఎన్ని ప్రభుత్వాలు మారినా బిల్లుకు మాత్రం ఆమోదం రాలేదని చెప్పారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు కేటాయించాలని డిమాండ్ చేశారు.

Read more>>

Updated On 9 March 2023 10:06 AM GMT
Somu

Somu

Next Story