Cyber Crime | ఓ యువ‌తి చేతిలో 44 ఏండ్ల పూజారి( Priest ) మోస‌పోయాడు. యువ‌తి చేసిన ప‌నికి రూ. 1.5 ల‌క్ష‌లు పోగొట్టుకున్నాడు పూజారి. తాను మోస‌పోయాన‌ని గ్ర‌హించిన బాధిత పూజారి సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు( Cyber Crime Police ) ఫిర్యాదు చేశాడు. వివ‌రాల్లోకి వెళ్తే.. సెంట్ర‌ల్ ఢిల్లీకి చెందిన ఓ 44 ఏండ్ల వ్య‌క్తి స్థానికంగా ఉన్న ఓ ఆల‌యంలో పూజారిగా కొన‌సాగుతున్నాడు. అయితే రెండు వారాల క్రితం ఓ యువ‌తి( […]

Cyber Crime |

ఓ యువ‌తి చేతిలో 44 ఏండ్ల పూజారి( Priest ) మోస‌పోయాడు. యువ‌తి చేసిన ప‌నికి రూ. 1.5 ల‌క్ష‌లు పోగొట్టుకున్నాడు పూజారి. తాను మోస‌పోయాన‌ని గ్ర‌హించిన బాధిత పూజారి సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు( Cyber Crime Police ) ఫిర్యాదు చేశాడు.

వివ‌రాల్లోకి వెళ్తే.. సెంట్ర‌ల్ ఢిల్లీకి చెందిన ఓ 44 ఏండ్ల వ్య‌క్తి స్థానికంగా ఉన్న ఓ ఆల‌యంలో పూజారిగా కొన‌సాగుతున్నాడు. అయితే రెండు వారాల క్రితం ఓ యువ‌తి( Woman ) ఆ పూజారికి ఫోన్ చేసింది. తాను ల‌క్నో( Lucknow ) నుంచి మాట్లాడుతున్నాన‌ని చెప్పింది.

అలా ఇద్ద‌రి మ‌ధ్య రెండు వారాల పాటు ఫోన్ సంభాష‌ణ కొన‌సాగింది. ఇక అనుకోకుండా.. ఒక రోజు ఆ యువ‌తి న‌గ్నంగా వీడియో కాల్ చేసింది. పూజారిని కూడా బ‌ట్ట‌లు విప్పేయాల‌ని కోరింది. ఆమె చెప్పిన‌ట్లు పూజారి చేశాడు.

అయితే అవ‌త‌లి వైపు రికార్డు చేస్తున్న‌ట్లు గ్ర‌హించిన పూజారి.. క్ష‌ణాల్లోనే కాల్ క‌ట్ చేశాడు. అనంత‌రం ఆమె నంబ‌ర్‌ను బ్లాక్ చేశాడు. ఇక మ‌రుస‌టి రోజు మ‌రో నంబ‌ర్ నుంచి ఇద్ద‌రూ న్యూడ్‌గా ఉన్న వీడియోను యువ‌తి పంపింది. డ‌బ్బులు ఇవ్వాల‌ని, లేని ప‌క్షంలో ఆ వీడియోను సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేస్తాన‌ని హెచ్చ‌రించింది. ఆ నంబ‌ర్‌ను కూడా బ్లాక్ చేశాడు పూజారి.

మూడో రోజు ఇంకో నంబ‌ర్ నుంచి కాల్ రాగా ఆ నంబ‌ర్ ను కూడా బ్లాక్ చేశాడు. కాసేప‌టికే వాట్సాప్ వీడియో కాల్ వ‌చ్చింది. అవ‌తలి వ్య‌క్తి పోలీసు యూనిఫాంలో ఉన్నాడు. త‌న వ‌ద్ద ఉన్న వీడియోలు ఉన్నాయ‌ని, వాటిని ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తాన‌ని హెచ్చ‌రించాడు.తాను అడిగినంత డ‌బ్బు ఇవ్వ‌క‌పోతే అది త‌ప్ప‌ద‌ని తెలిపాడు.

దీంతో భ‌య‌ప‌డిపోయిన పూజారి రూ. 49 వేలు అత‌నికి పంపాడు. రూ. 49 వేలు పంప‌గానే.. మ‌రోసారి కాల్ చేశాడు గుర్తు తెలియ‌ని వ్య‌క్తి. త‌న వ‌ద్ద ఇంకో రెండు, మూడు వీడియోలు ఉన్నాయి. అవి కూడా డిలీట్ చేయాలంటే రూ. ల‌క్ష కావాల‌ని డిమాండ్ చేశాడు.

అడిగినంత డ‌బ్బు ఇవ్వ‌క‌పోతే అరెస్టు చేసి, ఆరేండ్లు జైల్లో పెడుతామ‌ని వారు హెచ్చ‌రించిన‌ట్లు పూజారి తెలిపాడు. ఈ క్ర‌మంలోనే పోలీసుల‌కు ఫిర్యాదు చేశాన‌ని పూజారి పేర్కొన్నాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Updated On 21 March 2023 2:55 PM GMT
subbareddy

subbareddy

Next Story