విధాత: బంజారాహిల్స్‌లోని డీఏవీ పాఠ‌శాల గుర్తింపు ర‌ద్దు చేయాల‌ని విద్యాశాఖ నిర్ణ‌యం తీసుకున్న‌ది. దీంతో అందులో చ‌దివే 700 మంది విద్యార్థుల భ‌విష్య‌త్తు గంద‌ర‌గోళంలో ప‌డింది. ఒక్కో త‌ర‌గ‌తిలో సుమారు 50 మంది విద్యార్థుల వ‌ర‌కు ఉన్నారు. దీంతో త‌ల్లిదండ్రుల్లో ఆందోళ‌న మొద‌లైంది. విద్యార్థుల‌ను స‌మీపంలోని పాఠ‌శాల‌ల‌కు స‌ర్దుబాటు చేయాల‌ని నిర్ణ‌యించింది. చెల్లించిన ఫీజును యాజ‌మాన్యం తిరిగి ఇవ్వాల‌ని ఫీజు చెల్లిస్తే విద్యార్థుల‌ను ఎక్క‌డైనా చేర్పించుకునే అవ‌కాశం ఉంటుంద‌ని విద్యాశాఖ ప‌లు ఆప్ష‌న్ల‌ను సూచిస్తున్న‌ది. అయితే కొంత‌మంది […]

విధాత: బంజారాహిల్స్‌లోని డీఏవీ పాఠ‌శాల గుర్తింపు ర‌ద్దు చేయాల‌ని విద్యాశాఖ నిర్ణ‌యం తీసుకున్న‌ది. దీంతో అందులో చ‌దివే 700 మంది విద్యార్థుల భ‌విష్య‌త్తు గంద‌ర‌గోళంలో ప‌డింది. ఒక్కో త‌ర‌గ‌తిలో సుమారు 50 మంది విద్యార్థుల వ‌ర‌కు ఉన్నారు. దీంతో త‌ల్లిదండ్రుల్లో ఆందోళ‌న మొద‌లైంది.

విద్యార్థుల‌ను స‌మీపంలోని పాఠ‌శాల‌ల‌కు స‌ర్దుబాటు చేయాల‌ని నిర్ణ‌యించింది. చెల్లించిన ఫీజును యాజ‌మాన్యం తిరిగి ఇవ్వాల‌ని ఫీజు చెల్లిస్తే విద్యార్థుల‌ను ఎక్క‌డైనా చేర్పించుకునే అవ‌కాశం ఉంటుంద‌ని విద్యాశాఖ ప‌లు ఆప్ష‌న్ల‌ను సూచిస్తున్న‌ది. అయితే కొంత‌మంది విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌ను పాఠ‌శాల‌ను ఇక్క‌డే కొన‌సాగించాల‌ని కోరుతున్నారు.

పాఠ‌శాల యాజ‌మాన్యం కాకుండా ఒక ప్ర‌త్యేక క‌మిటీని ఏర్పాటు చేసి, అందులో త‌ల్లిదండ్రులను కూడా స‌భ్యులుగా చేర్చి వాళ్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో న‌డిపించాల‌ని ఒక ప్ర‌తిపాద‌న‌ను మంత్రి స‌బిత దృష్టికి తీసుకెళ్లగా ఈ ప్ర‌తిపాద‌న‌ల‌ను అన్నింటిని విద్యాశాఖ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటున్న‌దని, డీఏవీ పాఠ‌శాల‌ల‌కు దేశ‌వ్యాప్తంగా మంచి పేరున్న‌దని.. అందులో చాలామంది ప్ర‌ముఖులు చ‌దువుకున్నారనే అంశాల‌ను కూడా విద్యాశాఖ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న‌దన్నారు.

అయితే ఆ పాఠ‌శాల‌లో జ‌రిగిన ఘ‌ట‌న దుర‌దృష్ట‌క‌రమైన‌ప్ప‌టికీ మిగతా విద్యార్థుల భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకుని ప్ర‌త్యేక్ష ప‌ర్య‌వేక్ష‌ణ క‌మిటీ ఏర్పాటు చేయ‌డ‌మా? లేకుంటే త‌ల్లిదండ్రులు ఏ విధంగా సూచిస్తే ఆ విధంగా వ్య‌వ‌హ‌రించ‌డ‌మా అన్న అంశాల‌ను విద్యాశాఖ చ‌ర్చిస్తున్న‌దన్నారు.

కొంత‌మంది విద్యార్థుల త‌ల్లిదండ్రులు ప్ర‌త్యేక్ష ప‌ర్య‌వేక్ష‌ణ‌లో పాఠ‌శాల‌ల‌ను కొన‌సాగించాల‌ని కోరుతుంటే మ‌రికొంత మంది మాత్రం పాఠ‌శాల గుర్తింపు ర‌ద్దు చేసి, ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు. వీట‌న్నింటికి సంబంధించి విద్యాశాఖ మ‌రోసారి స‌మావేశ‌మై విస్తృతంగా చ‌ర్చిస్తున్నారు.

ఈ విద్యా సంవ‌త్స‌రం మ‌రో మూడు నాలుగు నెల‌ల్లో పూర్తి కానున్న‌ది. ఈ స‌మ‌యంలో విద్యార్థుల‌ను ఇత‌ర పాఠాల‌ల్లో స‌ర్దుబాటు చేస్తే ఇబ్బందులు త‌లెత్తుతాయ‌నే కొంత‌మంది విద్యార్థుల త‌ల్లిదండ్రులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇలా భిన్న‌మైన అభిప్రాయాలు వ్య‌క్తమ‌వుతున్నాయి.

పాఠ‌శాల శాఖ యాజ‌మాన్యం కూడా విద్యాశాఖ ఏ విధంగా ఆదేశిస్తే ఆ విధంగా ముందుకెళ్లాల‌ని యోచిస్తున్న‌ట్టు స‌మాచారం. అధికారికంగా దీనిపై యాజ‌మాన్యం ఇప్ప‌టివ‌ర‌కు స్పందించ‌లేదు. ఈ నేప‌థ్యంలో పాఠ‌శాల విద్యా శాఖ క‌చ్చిత‌మైన నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉన్న‌ది.

Updated On 22 Oct 2022 8:08 AM GMT
krs

krs

Next Story