విధాత: మునుగోడులో టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా మంత్రులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా ఊరూరా తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత ఉప ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని మునుగోడులో టీఆర్ఎస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కదులుతున్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ సంస్థాన్ నారాయణపురంలో విలేకర్లతో మాట్లాడుతూ.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై ఫైర్ అయ్యారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్వార్థ రాజకీయాలు, కాంట్రాక్టుల కోసమే బీజేపీలో చేరారని మంత్రి […]

విధాత: మునుగోడులో టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా మంత్రులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా ఊరూరా తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత ఉప ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని మునుగోడులో టీఆర్ఎస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కదులుతున్నారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ సంస్థాన్ నారాయణపురంలో విలేకర్లతో మాట్లాడుతూ.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై ఫైర్ అయ్యారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్వార్థ రాజకీయాలు, కాంట్రాక్టుల కోసమే బీజేపీలో చేరారని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. ఆయన ఏ రోజైనా ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడారా? అని ప్రశ్నించారు. గత నాలుగేళ్లుగా మునుగోడు అభివృద్ధి కుంటుపడింది.
నేడు సంస్తాన్ నారాయణపురంలో ముదిరాజ్ సంఘంతో ఆత్మీయ సమావేశం.
— Gangula Kamalakar (@GKamalakarTRS) October 19, 2022
👉 ప్రజలు ఓటేసి గెలిపించేది ప్రజా సమస్కల పరిష్కారం కోసం, సొంత కాంట్రాక్టుల కోసం కాదు. 18వేల కోట్ల కాంట్రాక్టుల కోసం రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి.
👉 సంక్షేమ పథకాలతో అండగా ఉన్న కేసీఆర్ గారికి మద్దుతు ఇవ్వాలి pic.twitter.com/Vm7wEw5YrK
ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి రాజగోపాల్ ఒక్కసారి కూడా నియోజకవర్గానికి రాలేదని విమర్శించారు. ఎప్పుడూ అందుబాటులో ఉండనటువంటి మంత్రులు ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రజల దగ్గరి వచ్చి సమస్యల గురించి అడుగుతున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ మేము 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నాం. మునుగోడు అభివృద్ధి బాధ్యత మేమే తీసుకుంటామన్నారు.
