Dharmapuri | కలెక్టర్ కు ఎంపీ ధర్మపురి అరవింద్ ఫిర్యాదు విధాత ప్రతినిధి, నిజామాబాద్: దొంగ ఓట్ల నమోదు ప్రక్రియను సాంకేతిక పరిజ్ఞానంతో అరికట్టాలని, దొంగ ఓట్ల దరఖాస్తులు నమోదు చేస్తున్న మీసేవ కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని నిజామాబాదు ఎంపీ ధర్మపురి అరవింద్ కోరారు. ఈమేరకు గురువారం ఆయన కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్ల నమోదు వెనుక ఉన్న అధికార పార్టీకి చెందిన సూత్రధారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా […]

Dharmapuri |
- కలెక్టర్ కు ఎంపీ ధర్మపురి అరవింద్ ఫిర్యాదు
విధాత ప్రతినిధి, నిజామాబాద్: దొంగ ఓట్ల నమోదు ప్రక్రియను సాంకేతిక పరిజ్ఞానంతో అరికట్టాలని, దొంగ ఓట్ల దరఖాస్తులు నమోదు చేస్తున్న మీసేవ కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని నిజామాబాదు ఎంపీ ధర్మపురి అరవింద్ కోరారు. ఈమేరకు గురువారం ఆయన కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్ల నమోదు వెనుక ఉన్న అధికార పార్టీకి చెందిన సూత్రధారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో మొత్తం 246 పోలింగ్ బూత్ లలో ఓటర్ నమోదు కు 8669 దరఖాస్తులు రాగా, బోధన్ పట్టణంలో 8 పోలింగ్ కేంద్రాల్లో 4024 దరఖాస్తులు నమోదు కావడంపై అనుమానాలకు తావిస్తోందని అన్నారు. బోధన్ లోని కొన్ని మీ సేవ కేంద్రాలను ఎంచుకొని, అందులో రాష్ట్ర సరిహద్దున ఉన్న మహారాష్ట్రలోని ధర్మాబాద్, బిలోలి తాలూకాల ప్రాంతాల నుంచి కొందరికి డబ్బు ఆశ చూపి అధికారపార్టీ చెందిన కీలక వ్యక్తి ఈ ప్రక్రియకు ఒడికడుతున్నట్లు ఆరోపించారు.
దరఖాస్తులన్నిటిని ప్రత్యేక బృందాల ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఓటరు నమోదు దరఖాస్తుల ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు
