Dhoni | క్రికెట్ ప్రేమికుల‌కి ప‌రిచయం అక్క‌ర్లేని పేరు ధోని. ఇండియన్ క్రికెట్ ప్రపంచంలో స‌రికొత్త అధ్యాయం లిఖించాడు. క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులు చెరిపేసిన ధోని ప‌లు బ్రాండ్స్‌కి అంబాసిడ‌ర్‌గా ఉండగా ఆయ‌నపై ఓ బ‌యోపిక్ కూడా రూపొందింది. ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి త‌ప్పుకున్న త‌ర్వాత బిజినెస్‌ల‌పై పూర్తి దృష్టి పెట్టాడు. ధోని ఎంటర్టైన్ మెంట్ అని సంస్థను ప్రారంభించిన ఈ మిస్టర్ కూల్ రీసెంట్‌గా ఎల్‌జీఎమ్ అనే సినిమాని నిర్మించాడు. ఈ సినిమా […]

Dhoni | క్రికెట్ ప్రేమికుల‌కి ప‌రిచయం అక్క‌ర్లేని పేరు ధోని. ఇండియన్ క్రికెట్ ప్రపంచంలో స‌రికొత్త అధ్యాయం లిఖించాడు. క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులు చెరిపేసిన ధోని ప‌లు బ్రాండ్స్‌కి అంబాసిడ‌ర్‌గా ఉండగా ఆయ‌నపై ఓ బ‌యోపిక్ కూడా రూపొందింది.

ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి త‌ప్పుకున్న త‌ర్వాత బిజినెస్‌ల‌పై పూర్తి దృష్టి పెట్టాడు. ధోని ఎంటర్టైన్ మెంట్ అని సంస్థను ప్రారంభించిన ఈ మిస్టర్ కూల్ రీసెంట్‌గా ఎల్‌జీఎమ్ అనే సినిమాని నిర్మించాడు. ఈ సినిమా మోస్త‌రు విజయాన్ని అందుకుంది. ఏదేమైన ధోని మాత్రం ప‌క్కా ప్రణాళిక‌తో ముందుకు సాగుతున్నాడు.

మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గామంచి పేరు తెచ్చుకున్న‌ మహేంద్ర సింగ్ ధోని.. టీమిండియాకు రెండు ప్రపంచకప్‌ల‌ని అందించాడు. ఇక‌ 2013లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాని చాంపియన్ గా నిలబెట్టాడు. ఐపీఎల్ లోకూడా ధోని పేరిట అద్భుతమైన రికార్డు ఉంది.

India: ఈ నెల‌లోనే రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌బోతున్న ధోని ఫేవ‌రేట్ ప్లేయ‌ర్స్.. వారెవ‌రంటే..!

చెన్నై సూపర్ కింగ్స్ ను ఏకంగా 5 సార్లు చాంపియన్ గా నిలబెట్టిన ఘ‌న‌త కూడా ధోనికి ఉంది. ఆయ‌న రిటైర్మెంట్ తీసుకొని మూడేళ్లు అవుతున్నా కూడా క్రేజ్ ఇప్ప‌టికీ అలానే ఉంది. ధోనికి సంబంధించి ఎప్పుడు ఏదో ఒక వార్త నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ధోని కూతురుకి సంబంధించిన వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

ధోని, సాక్షి దంపుతలకు జీవా 2015లో జన్మించ‌గా, ప్ర‌స్తుతం ఆ చిన్నారి వయసు 8 ఏళ్లు. ధోని కూతురు ఇప్పుడు నాలుగో త‌ర‌గతి చ‌దువుతున్న‌ట్టు తెలుస్తుంది. అయితే ధోని తలచుకుంటే జీవాను విదేశాల్లో చదివించ గల స‌త్తా ఉంది. కానీ ఆయ‌న త‌న స్వస్థలం రాంచీలోని ప్రముఖ ఇంటర్నేషనల్ స్కూల్లో చ‌దివిస్తున్నాడు.


జీవా డే స్కాలర్ గా ఉండ‌గా,ఇప్పుడు ఆ పాప స్కూల్ ఫీజు హ‌ట్ టాపిక్‌గా మారింది. జీవా స్కూలు ఫీజు ఏడాదికి రూ. 2.75 లక్షలు అని తెలుస్తుంది. అంటే నెలకు రూ. 23 వేల రూపాయలు ఖ‌ర్చు చేస్తున్నారు.

ధోని లాంటి వ్య‌క్తికి ఇది చాలా చిన్న మొత్త‌మే. పాప చదివే స్కూల్లో హాస్టల్ లో ఉండాలంటే మాత్రం ఏడాదికి రూ. 4.40 లక్షలు అవుతుందని అంటున్నారు.

Smriti Mandhana | ఈ అంద‌మైన ఉమెన్‌ క్రికెట‌ర్.. అత‌గాడితో ప్రేమ‌లో ఉందా! హాట్ టాపిక్‌గా డేటింగ్

Kohli | కోహ్లీతో వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడారు.. ఇప్పుడు అంపైర్లుగా చేస్తున్నారు… వారెవ‌రంటే..!

Tilak Varma: క‌రేబీయ‌న్ గ‌డ్డ‌పై తెలుగోడి స‌త్తా.. రెండో టీ20లోను నిరాశ‌ప‌ర‌చిన భార‌త్

Updated On 9 Aug 2023 12:07 PM GMT
sn

sn

Next Story