విధాత‌: మందులేని మనోవ్యాధిని నిర్ధారించడం, చికిత్స అందించడంలో ఒక అడుగు ముందుకు వేశామని పిట్స్ బర్గ్ యూనివర్సీటికి చెందిన సైకియాట్రీ ప్రొఫెసర్ డాక్టర్ థామస్ కారికారి అంటున్నారు. అల్జీమర్స్ నిర్ధారణలో కొత్త పరీక్ష గురించి జర్నల్ బ్రెయిన్‌లో ఒక వ్యాసం ప్రచురితమైంది. చిన్న రక్త పరీక్షతో అల్జీమర్స్‌ని నిర్ధారించవచ్చని ఈ వ్యాసం సారాంశం. ప్రస్తుతం అల్జీమర్స్‌ని నిర్దారంచడానికి న్యూరో ఇమేజింగ్ పరీక్షను వినియోగిస్తున్నారు. ఈ పరీక్ష అందకీ అందుబాటులోఉండటం లేదు. రక్తపరీక్ష తక్కువ ఖ‌ర్చుతో పూర్తవుతుంది. ఈ […]

విధాత‌: మందులేని మనోవ్యాధిని నిర్ధారించడం, చికిత్స అందించడంలో ఒక అడుగు ముందుకు వేశామని పిట్స్ బర్గ్ యూనివర్సీటికి చెందిన సైకియాట్రీ ప్రొఫెసర్ డాక్టర్ థామస్ కారికారి అంటున్నారు. అల్జీమర్స్ నిర్ధారణలో కొత్త పరీక్ష గురించి జర్నల్ బ్రెయిన్‌లో ఒక వ్యాసం ప్రచురితమైంది. చిన్న రక్త పరీక్షతో అల్జీమర్స్‌ని నిర్ధారించవచ్చని ఈ వ్యాసం సారాంశం.

ప్రస్తుతం అల్జీమర్స్‌ని నిర్దారంచడానికి న్యూరో ఇమేజింగ్ పరీక్షను వినియోగిస్తున్నారు. ఈ పరీక్ష అందకీ అందుబాటులోఉండటం లేదు. రక్తపరీక్ష తక్కువ ఖ‌ర్చుతో పూర్తవుతుంది. ఈ పరీక్ష నిర్వహణ కూడా చాలా సులభం. ఈ పరీక్షా ఫలితాలను నిర్ధారించుకునేందుకు క్లీనికల్ ట్రయల్స్ లో పాల్గొనేందుకు అంగీకారం తెలిపిన వారిని ఎంపిక చేసుకొన్నారని అక్కడి నిపుణులు తెలియజేశారు.

నిజానికి కేంద్ర నాడీ వ్యవస్థకు చెందిన మెదడు గురించి తెలిసింది తక్కువ. మానవ మెదడు ఇప్పటికీ ఒక మిస్టరీనే. వయసు పెరిగే కొద్దీ మెదడు పనితీరు కూడా నెమ్మదిస్తుంది. మెదడులోని కొన్ని న్యూరాన్లు దెబ్బతినడం వల్ల అల్జీమర్స్ సమస్య వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా డిమెన్షియాతో బాధ‌ పడుతున్న వారిలో 50 నుంచి 75 శాతం అల్జీమర్స్ బారిన పడతున్నారని అల్జీమర్స్ సొసైటీ లెక్కలు తేలుస్తోంది.

అంతా ఈ ప్రోటీన్ వల్లే

ఈ కొత్త పరీక్ష బ్రెయిన్ డైవైర్ట్ టౌ అనే ప్రొటీన్ స్థాయిలను గుర్తిస్తుంది. దీన్ని సులభంగా గుర్తించరు కానీ అల్జీమర్స్ తో దీనికి సంబంధం ఉందట. అల్జీమర్స్ ను పార్కిన్సన్ వంటి ఇతర మెదడు సంబంధిత సమస్యల నుంచి వేరు చేసేది ఈ ప్రొటీనే అని నిపుణులు చెబుతున్నారు.

రక్తంలో బీడీ టౌ ఎక్కువగా ఉన్నపుడు అమలాయిడ్ ప్లేక్స్ అనే చెత్త మెదడులో పెరిగిపోతున్నట్టు గుర్తించారు. ఈ పరీక్షలు విజయవంతం అయ్యాక మెదడు కు సంబంధించిన అనారోగ్యాల నిర్ధారణలో ప్రొటీన్ల స్టడీ అన్నింటికంటే సరైన మార్గమని అభిప్రాయ పడుతున్నారు.

బ్లడ్ మార్కర్స్ పరీక్షా విధానం ద్వారా వ్యాధుల నిర్ధారించగలిగతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ మరింత పెంచుందుకు అవకాశం ఏర్పడతుందని, ముందుగానే అల్జీమర్స్ ను గుర్తించి జాగ్రత్తపడవచ్చని కూడా వీరి అభిప్రాయం. ఈ ట్రయల్స్ తర్వాత పరిశోధనల్లో ఒక అడుగు ముందుకు పడినట్టుగా భావిస్తున్నారు. త్వరలోనే చికిత్స కు కూడా మార్గం సుగమం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ పరీక్షా ఫలితాలను బట్టి మెదడులోని హాని కారక ప్రోటీన్ తొలగించేందుకు అవసరమ్యే మందులను కూడా సెప్టెంబర్ నెలలో వినియోగించి మంచి ఫలితాలు కూడా సాధించారు. లెకనేమాబ్ అనే ఈ మెడిసిన్ 18 నెలల వ్యవధిలో అల్జీమర్స్ స్థాయిని 27 శాతం వరకు తగ్గించిందట.

అమిలాయిడ్ అనే ప్రోటీన్ తో పేరుకుపోయిన చెత్తను మెదడు నుంచి క్లియర్ చెయ్యడంలో ఈ మందు విజయవంతంగా పనిచేస్తోందని ఫలితంగా అల్జీమర్స్ నెమ్మదించిందని కూడా నిపుణులు చెబుతున్నారు. కొత్త ప్రయోగాల వల్ల జరిగిన పురోగతి అల్జీమర్స్ పేషెంట్లలో కొత్త ఆశలు చిగురింపజేస్తోందని అనడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు.

Updated On 2 Jan 2023 2:02 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story