విధాత : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, గుజ్జుల ఉమాశంకర్ రెడ్డితో కలిసి మర్డర్ చేసినట్టు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎర్రగంగిరెడ్డి హత్యకు ప్లాన్ చేసినట్లు స్టేట్మెంట్లో తెలిపారు. కాగా వివేకా హత్యకు పూర్వం జరిగిన బెంగళూరు ల్యాండ్ వివాదంలో వాటా ఇవ్వకపోవడంపై ఎర్ర గంగిరెడ్డి ఆగ్రహంతో రగిలిపోయారు. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గంగిరెడ్డి మోసం చేశాడని.. మీ సంగతి తేలుస్తానంటూ […]

విధాత : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, గుజ్జుల ఉమాశంకర్ రెడ్డితో కలిసి మర్డర్ చేసినట్టు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎర్రగంగిరెడ్డి హత్యకు ప్లాన్ చేసినట్లు స్టేట్మెంట్లో తెలిపారు.

కాగా వివేకా హత్యకు పూర్వం జరిగిన బెంగళూరు ల్యాండ్ వివాదంలో వాటా ఇవ్వకపోవడంపై ఎర్ర గంగిరెడ్డి ఆగ్రహంతో రగిలిపోయారు. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గంగిరెడ్డి మోసం చేశాడని.. మీ సంగతి తేలుస్తానంటూ గంగిరెడ్డి, అవి నాశ్ లకు వివేకా వార్నింగ్ ఇచ్చినట్టు కన్ఫెషన్ స్టేట్మెంట్లో పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకానందరెడ్డి ఓటమి తర్వాత అవినాష్ ఇంటి దగ్గర వాగ్వాదం జరిగింది. నన్ను కావాలనే ఓడించారు.. మీ కథ తేలుస్తానంటూ ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కరరెడ్డి, డి.శంకర్ రెడ్డిలకు వివేకా వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోసం చేయడంపై ఎర్ర గంగిరెడ్డి, గుజ్జుల జగదీశ్వర్ రెడ్డిని ఆఫీసుకు పిలిపించి తిట్టినట్లు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు.

తర్వాత కొన్ని రోజులపాటు వైఎస్ వివేకా, గంగిరెడ్డిల మధ్య మాటలు బందయ్యాయి. ఈ క్రమంలో కోటి రూపాయలు ఇస్తాం.. వివేకాను హత్య చేయాలని గంగిరెడ్డి ఆఫర్ చేసినట్టు కన్ఫెషన్ స్టేట్ మెంట్ లో దస్తగిరి వెల్లడించారు. నువ్వొక్క డివే కాదు, మేమూ వస్తాం కలిసి వివేకాను చంపేద్దా మంటూ గంగిరెడ్డి చెప్పినట్టు దస్తగిరి స్టేట్మెంట్ ఇచ్చాడు. దీని వెనుక అవినాష్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, డి.శంకర్ రెడ్డి ఉన్నారని ఎర్ర గంగిరెడ్డి తెలిపాడు.

ఐతే వివేకా హత్యకు మొత్తం రూ. 40 కోట్ల సుపారీ మాట్లా డుకున్నామని.. కాగా ఇందులో తనకు 5 కోట్లు ఇస్తానని ఆఫర్ చేసి.. ఇచ్చిన అడ్వాన్స్ లో 25 లక్షలు సునీల్ యాదవ్ తిరిగి తీసుకున్నాడని గంగిరెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడు. తన స్నేహితుడు మున్నా దగ్గర మిగతా 75 లక్షలు దాచానని దస్తగిరి తెలిపాడు.

ఘటన జరిగిన రోజు సునీల్ యాదవ్, ఉమాశంకరరెడ్డి కలిసి వివేకా ఇంటి దగ్గర కుక్కను కారుతో తొక్కించి చంపేసి వివేకా ఇంటి కాంపౌండ్లోకి వెళ్లగా అప్పటికే ఇంట్లో ఉన్న ఎర్ర గంగిరెడ్డి తలుపుతీయగా లోపలికి వెళ్లినట్లు దస్తగిరి తెలిపాడు. తనను చూసిన వివేకా ఈ సమయంలో వీళ్ళెందుకు వచ్చారని నిర్ఘాంత పోయారని, తర్వాత వివేకా బెడ్ రూమ్ లోకి వెళ్లడంతో అతని వెనుకే గంగిరెడ్డి కూడా వెళ్లగా అక్కడ డబ్బు గురించి తీవ్ర వాగ్వాదం జరిగిందన్నారు.

అక్కడే ఉన్న సునీల్ యాదవ్ వివేకాను బూతులు తిడుతూ మొదట మొహంపై కొట్టి అనంతరం గొడ్డలితో దాడి చేశాడని వివేకా కింద పడిపోవడంతో అతని ఛాతీపై 7,8 సార్లు సునీల్ యాదవ్ బలంగా కొట్టినట్టు దస్తగిరి వెల్లడించాడు.

Updated On 13 Nov 2021 5:06 PM GMT
subbareddy

subbareddy

Next Story