Tuesday, January 31, 2023
More
    Homelatestమళ్లీ వివాదంలో దిల్ రాజు.. ఈసారి సమంత కారణం!  

    మళ్లీ వివాదంలో దిల్ రాజు.. ఈసారి సమంత కారణం!  

    • రెండు నాలుకల ధోరణి ఉన్న దిల్ రాజు‌కు చెక్ పెట్టబోతున్నారా?

    విధాత‌: దిల్ రాజు టాలీవుడ్ పరిశ్రమను శాసించాలని చూస్తున్నాడు. థియేటర్లను తన చేతిలో పెట్టుకొని బాలయ్య, చిరంజీవి వంటి వారితోనే గేమ్స్ ఆడుతున్నాడు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలకు సరి సమానంగా.. తాను తీసిన డబ్బింగ్ మూవీ వారసుడుకు థియేట‌ర్ల‌ను కేటాయిస్తూ తెలుగులో ఇదే స‌మ‌యంలో రిలీజ్ చేయడానికి సిద్ధ పడుతున్నాడు.

    గతంలో పండగల సమయంలో తెలుగు సినిమాలు విడుదలవుతూ ఉంటే ముందుగా థియేటర్లు వాటికే కేటాయించాలని, డబ్బింగ్ చిత్రాలకు ఆ తర్వాత కేటాయించాలన్న వివాదాన్ని మొదట కలబెట్టింది ఆయనే. ప్రస్తుతం ఆయన దానికి విరుద్ధంగా బిహేవ్ చేస్తున్నాడు. ఇక ఆ మధ్య కార్తికేయ 2 సినిమా రిలీజ్ పోస్ట్ కావడానికి కారణం కూడా దిల్ రాజే అని వార్తలు వచ్చాయి.

    ఇటీవల దిల్‌రాజు ఒకేసారి మూడు సినిమాల రిలీజింగ్ ఉండడంతో అందులో తన థాంక్యూ కూడా ఉంది కాబట్టి నిర్మాతలను ఒప్పించి ఆ పని చేశానే గానీ బలవంతంగా చేయలేదని ఏదో వెన్నపూసి మాయ చేసే ప్రయత్నం చేశాడు.

    మరి అలాంటి దిల్ రాజు ఇప్పుడు తాను నిర్మాణ భాగస్వామ్యం వహిస్తున్న ‘శాకుంత‌లం’ చిత్రాన్ని మూడు చిత్రాలు విడుదలవుతున్న రోజే రిలీజ్ డేట్‌ను ప్రకటించడం చూస్తే ఆయన వివాదాల కోరుగా మారుతున్నాడని అర్థమవుతుంది.

    ఇక విషయానికి వస్తే టాలీవుడ్‌లో మరోసారి విడుదల తేదీల వివాదం నెలకొంది. ఫిబ్రవరి 17న దిల్ రాజు తాను నిర్మాణ భాగస్వామ్యం వ్యవహరించిన ‘శాకుంతలం’ సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించు కున్నారు. దానికి తగ్గట్టే పోస్టర్‌ని వదిలాడు. రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశాడు. అదే తేదీన మరో మూడు సినిమాలు ఎంతో ముందుగానే రిలీజ్ డేట్లను ప్రకటించాయి.

    అందులో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తమిళ స్టార్ ధనుష్ హీరోగా వెంకి అట్లూరి దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘స‌ర్’ సినిమా ఒకటి. రెండోది విశ్వక్సేన్ తానే నటిస్తూ నిర్మిస్తున్న ‘దాస్ కి ధ‌మ్కీ’. మూడో సినిమా గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ‘వినరో భాగ్యము విష్ణు కథ’. కిరణ్ అబ్బవరం నటిస్తున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నాడు.

    ఇలా మూడు సినిమాలు ఆల్రెడీ రిలీజ్ డేట్‌లను ఎప్పుడో అనౌన్స్ చేస్తే.. దిల్ రాజు కొత్తగా తన ‘శాకుంతలం’ చిత్రాన్ని అదే తేదీకి ఫిక్స్ చేయడం వివాదానికి కారణం అవుతుంది. అందులో దాదాపు తెలుగులో విడుద‌ల‌య్యే ప్రతి చిత్రాన్ని నైజాం ఏరియాకు హ‌క్కులు తీసుకునే దిల్ రాజు.. ఈ మూడు చిత్రాలను మాత్రం పంపిణీ చేయడం లేదు. దీంతో ఇప్పుడు దిల్ రాజుకు వ్యతిరేకంగా ఇండస్ట్రీ అంతా కలిసి ఒక గ్రూపుగా రెడీ అవుతున్నార‌ని టాక్.

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular