విధాత: సినిమా హీరోల మధ్య, స్టార్ల మధ్య పోటీ ఉండొచ్చు కానీ.. వారి పోటీపై హీరోయిన్లు, దర్శకనిర్మాతలు ఏమైనా కామెంట్ చేస్తే అది వారి కెరీర్‌కే ప్రమాదం. ఫలానా హీరో సూపర్ అని అతని నెంబరు ఇదని స్టేట్‌మెంట్స్ ఇస్తే దర్శక నిర్మాతలకు హీరోయిన్లకు తిప్పలు తప్పవు. ఎందుకంటే మిగిలిన స్టార్ హీరోలు వారిని పక్కన పెట్టేస్తారు. ఇక విషయానికొస్తే ఇటీవల దిల్ రాజు.. అజిత్ కంటే విజయ్ నెంబర్‌వన్ స్టార్ అని స్టేట్మెంట్ ఇచ్చి అజిత్‌ […]

విధాత: సినిమా హీరోల మధ్య, స్టార్ల మధ్య పోటీ ఉండొచ్చు కానీ.. వారి పోటీపై హీరోయిన్లు, దర్శకనిర్మాతలు ఏమైనా కామెంట్ చేస్తే అది వారి కెరీర్‌కే ప్రమాదం. ఫలానా హీరో సూపర్ అని అతని నెంబరు ఇదని స్టేట్‌మెంట్స్ ఇస్తే దర్శక నిర్మాతలకు హీరోయిన్లకు తిప్పలు తప్పవు. ఎందుకంటే మిగిలిన స్టార్ హీరోలు వారిని పక్కన పెట్టేస్తారు.

ఇక విషయానికొస్తే ఇటీవల దిల్ రాజు.. అజిత్ కంటే విజయ్ నెంబర్‌వన్ స్టార్ అని స్టేట్మెంట్ ఇచ్చి అజిత్‌ అభిమానుల నుంచి తీవ్ర నిరసన ఎదుర్కొన్నాడు. మ‌రి ఈ ప్ర‌భావం దిల్‌రాజు తీస్తున్న ‘వారసుడు’ చిత్రంపై ఉంటుందా? లేదా? అనేది పక్కన పెడితే భవిష్యత్తులో ఆయనకు అజిత్‌తో సినిమా చేసే అవకాశం ఉండకపోవచ్చు.

విషయానికి వస్తే టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా చలామణి అయిన త్రిష.. ఇక్కడ అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్‌కి వెళ్ళిపోయింది. తన సొంత ఇంటికి చేరిన ఆమె ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తోంది. ప్ర‌స్తుతం ఆమె ‘రాంగీ’ అనే చిత్రం చేస్తోంది. ఈ మూవీ లేడీ ఓరియంటెడ్ మూవీగా రూపొందుతోంది. తాజాగా రాంగీకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్న త్రిషను తమిళనాడులో విజయ్, అజిత్‌లలో ఎవరు నెంబర్‌వన్ స్టార్? అని ప్రశ్నించగా ఆమె తెలివిగా సమాధానం చెప్పింది.

ఇద్దరూ చాలా అనుభవం ఉన్న నటులు. ఇద్దరికీ స్టార్ స్టేటస్ ఉంది. వీరిలో ఎవరు నెంబర్‌వన్ అనేది చెప్పడం కష్టం. వ్యక్తిగతంగా నాకు నెంబర్ గేమ్స్‌పై నమ్మకం లేదు. మనం నటించిన చివరి సినిమా విజయం అందుకుంటే నెంబర్‌వన్‌గా ఉంటాము. లేదంటే ఎవరి చివరి సినిమా విజయం సాధించి ఎంజాయ్ చేస్తుంటారో వారు నెంబర్‌వన్‌గా ఉంటారు. నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టక‌ ముందే విజయ్‌, అజిత్‌లు స్టార్ స్టేటస్ అందుకున్నారు. ఇద్దరు పెద్ద స్టార్స్ అయినప్పుడు ఎవరో ఒకరిని ఎన్నుకోవడం కష్టం అని చెప్పుకొచ్చింది.

ఆమె సమాధానం విన్నవారంతా.. దిల్ రాజు ఇదే మిస్సయ్యాడని అనుకుంటున్నారు. త్రిష మాత్రం చాలా తెలివిగా సమాధానం ఇచ్చిందంటూ.. ఆమెను అభినందిస్తున్నారు. కాగా త్రిష దాదాపు 15 ఏళ్ల తర్వాత విజయ్‌తో సినిమా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి ఇంకా పేరు పెట్టలేదు. ఆమె నటించిన రాంగీ చిత్రం ఈ నెల 30న విడుద‌ల కానుంది. ఇందులో త్రిష జర్నలిస్టు పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాతో సోలో హిట్ కొట్టాలని త్రిష ఎంతగానో ఆరాటపడుతోంది.

Updated On 29 Dec 2022 4:42 AM GMT
krs

krs

Next Story