Tuesday, January 31, 2023
More
  Homelatestదిల్ రాజు పక్కా కమర్షియలా?

  దిల్ రాజు పక్కా కమర్షియలా?

  విధాత: దిల్ రాజు పక్కా కమర్షియల్ అని అందరికీ పూర్తిగా అర్థం అవుతుంది. ఇంతకాలం ఆయనను వెనకేసుకొచ్చిన వారు కూడా ఇప్పుడు ఆయన అంటే మండిపడుతున్నారు. అబ్బా తెలుగులో ఇలాంటి నిర్మాత లేడు అని పొగిడిన వారే ఇప్పుడు చీకొడుతున్నారు. తెలుగు సినిమా బాగుండడమే నాకు కావాల్సింది. చిరంజీవి, బాలకృష్ణ నా హీరోలు. బాలకృష్ణ గారి అఖండ సినిమాను నేనే నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేశాను. వారి కోసమే వారసుడు సినిమాను వాయిదా వేస్తున్నాను.. అని దిల్ రాజు తన తాజా ప్రెస్ ‌మీట్‌లో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.

  మరి ఫిబ్రవరి 17న ఆల్ రెడీ మూడు చిత్రాలు లాక్ అయి ఉన్నాయని తెలిసి కూడా తన ‘శాకుంతలం’ చిత్రాన్ని అంత మంచి మనసు ఉంటే ఎందుకు పోటీకి దింపాడు? అనేది ఆయనే చెప్పాలి. అదే తేదీకి సితార ఎంటర్టైన్మెంట్స్, గీత ఆర్ట్స్ 2ల చిత్రాలు కూడా విడుదల కానున్నాయి. వాటి తేదీని ఎప్పుడో ఖరారు చేశారు. ఇక వారసుడు పోస్ట్ పోన్ చేయ‌డం విషయానికి వస్తే విజయ్‌కి తెలుగులో పెద్దగా మార్కెట్ లేదు. అతనికి రజినీకాంత్, సూర్య, కార్తీ మాదిరి ఫాలోయింగ్ కూడా అసలు లేదు.

  అప్పుడెప్పుడో ఏదో ఒకటి రెండు సినిమాలు యావరేజ్‌గా ఆడాయి అంతే. వారసుడు ట్రైలర్‌ను చూసిన తెలుగు వారు పెదవి విరిచారు. ఇలాంటి కథలు ఎన్నో చూసామని త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో వచ్చిన అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, అల వైకుంఠపురములో చిత్రాలతో పాటు నవదీప్ నటించిన గౌతమ్ ఎస్.ఎస్.సి. టైపులో ఉందని తేల్చి పారేశారు. సో అతని సినిమా డ‌బ్ చేసినా కూడా సంక్రాంతి పోటీలో నిలవడం కష్టం అని ఆయ‌న‌కు అర్ధ‌మైంది. ఇది తెలుసుకునే వారసుడు సినిమాను దిల్ రాజు సంక్రాంతి పోటీ నుంచి పక్కన పెట్టాడని ఇండస్ట్రీ టాక్ మొదలైంది.

  వాస్తవానికి ఈయన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే‌లో నా వారసుడు సినిమా ఎవరికి పోటీ కాదు. నా థియేటర్ల‌ను ఇంకో సినిమాకు ఇచ్చేంత గొప్ప హృదయం నాకు లేదు అని పక్కా కమర్షియల్‌గా మాట్లాడాడు. ఎప్పటి నుంచో దిల్ రాజు ధోరణితో తెలుగు నిర్మాతలు ఎవరు సంతోషంగా లేరు. హారిక అండ్ హాసిని చిన్నబాబు, చెరుకూరి సుధాకర్, బన్నీ వాసు, అశ్విని దత్ ఇలా చెప్పుకుంటూ పోవాలి గాని అందరూ దిల్ రాజు బాధితులే. సినిమా థియేటర్లు ఆ నలుగురి చేతిలో బందీ అయ్యి ఉంటే ఎంత నష్టమో.. చిన్న నిర్మాతలకే కాదు ఇప్పుడు పెద్ద నిర్మాతలు కూడా తెలిసి వచ్చింది.

  అదే సమయంలో దిల్ రాజు.. అజిత్ నటించిన ‘తెగింపు’ చిత్రాన్ని జనవరి11న విడుదల చేశారు. ఆల్రెడీ యువీ క్రియేషన్స్ వారి కళ్యాణం కమనీయం సినిమాను దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. కాబట్టి సంక్రాంతి సీజన్‌కు ఆయ‌న చేతిలో మొత్తంగా మూడు సినిమాలు ఉన్నాయి. కాబట్టి గ్రాండ్ గా విడుదల చేసి ఒకటి రెండు వారాల్లోనే లాభాలు అందుకోవాలని దిల్ రాజు ప్లాన్. ఆయనకు ఇప్పుడు కళ్యాణం కమనీయం చిత్రం బంగారు బాతులా కనిపిస్తోంది. అందుకే ఆయన కాస్త వెనక్కి తగినట్టుగా అనిపిస్తోంది. పైగా తమ సినిమాలకు థియేటర్లు కూడా ఇచ్చాడని బాలయ్య, చిరుల దృష్టిలో మంచి మార్కులు పడతాయి. అంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నమాట అంటూ కొంద‌రు సెటైర్లు వేస్తున్నారు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular