విధాత: అనుకున్నట్లుగానే దిల్ రాజే వెనక్కి తగ్గాడు. మొన్నటి వరకు థియేటర్ల విషయంలో దిల్ రాజు పేరు ఎలా వైరల్ అయిందో తెలియంది కాదు. తన సినిమా కోసం మంచి థియేటర్లను బ్లాక్ చేయిస్తు న్నాడంటూ.. చిరు, బాలయ్య ఫ్యాన్సే కాకుండా.. ఇండస్ట్రీ పెద్దలు కూడా బాహాటంగా కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్‌లో ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇది వ్యాపారం. మేము కూడా బతకాలి కదా.. అంటూ దిల్ రాజు సంచలన కామెంట్స్ చేశాడు. […]

విధాత: అనుకున్నట్లుగానే దిల్ రాజే వెనక్కి తగ్గాడు. మొన్నటి వరకు థియేటర్ల విషయంలో దిల్ రాజు పేరు ఎలా వైరల్ అయిందో తెలియంది కాదు. తన సినిమా కోసం మంచి థియేటర్లను బ్లాక్ చేయిస్తు న్నాడంటూ.. చిరు, బాలయ్య ఫ్యాన్సే కాకుండా.. ఇండస్ట్రీ పెద్దలు కూడా బాహాటంగా కామెంట్స్ చేశారు.

ఈ కామెంట్స్‌లో ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇది వ్యాపారం. మేము కూడా బతకాలి కదా.. అంటూ దిల్ రాజు సంచలన కామెంట్స్ చేశాడు. ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి విడుదల అని తేల్చేశాడు. కానీ ఇండస్ట్రీలోని ఒత్తిడి కారణంగా దిల్ రాజు వెనక్కి తగ్గక తప్పలేదు. ‘వారసుడు’ చిత్రాన్ని ముందు ప్రకటించినట్లుగా జనవరి 11న కాకుండా.. జనవరి 14న విడుదల చేయబోతున్నట్లుగా ఆయన అధికారికంగా సోమవారం ఓ మీడియా సమావేశం నిర్వహించి మరీ ప్రకటించారు.

‘‘గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో వారసుడు విడుదలపై రకరకాలుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ సినిమాని ఎట్టిపరిస్థితుల్లో సంక్రాంతికి విడుదల చేయాలని ఫిక్సయ్యాను. జనవరి 14న సినిమాని విడుదల చేయబోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా తమిళ వెర్షన్ ‘వారిసు’ జనవరి 11న విడుదలవుతుంది. తెలుగు ‘వారసుడు’ మాత్రం జనవరి 14న విడుదలవుతుంది.

జనవరి 14కి వెళ్లడానికి కారణం.. ఇండస్ట్రీలోని పెద్దలందరితో డిస్కస్ చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాను. 11న తమిళ వెర్షన్ విడుదలై.. 14న తెలుగులో అంటే.. అప్పటికి సినిమా బయటికి వచ్చేస్తుంది కదా.. అని అంతా అనుమానం వ్యక్తం చేశారు. అది నాకు సినిమాపై ఉన్న నమ్మకం. తమిళ్‌లో సూపర్ హిట్ కొట్టబోతున్నాం.. సూపర్ హిట్ సినిమాని ఎప్పుడు ఎక్కడ విడుదల చేసినా ప్రాబ్లమ్ లేదు. మంచి సినిమా కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తారనే నమ్మకంతోనే ఆ నిర్ణయం తీసుకున్నాను.

కొన్ని రోజులుగా నన్ను అందరూ టార్గెట్ చేస్తున్నారు. ఓ మీడియా పర్సన్ చెప్పినట్లుగా పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అంటారు కదా.. అలా ఉంది పరిస్థితి. ఈ నిర్ణయం నేను తీసుకోవడానికి కారణం జనవరి 12న బాలయ్యగారి సినిమా, 13న చిరంజీవిగారి సినిమాలు వస్తున్నాయి. ప్రతి థియేటర్‌లో ముందు వారి సినిమాలు పడాలి.

తెలుగులో బిగ్ స్టార్స్ వాళ్లు.. వారికి ప్రతిచోటా థియేటర్లు దొరకాలి. తర్వాతే నా సినిమా ఉండాలనేదే నా మెయిన్ ఇన్‌టెన్షన్. వారిద్దరి సినిమాలకు నా ‘వారసుడు’ సినిమా పోటీ కాదు అని మొదటి నుంచి నేను చెబుతూనే ఉన్నాను. వారసుడు మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. అందుకే ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నాను. కానీ టాలీవుడ్ స్టార్ హీరోలకి భారీ స్థాయిలో థియేటర్లు కావాలి. అందుకే పాజిటివ్ థృక్పథం‌తో నా సినిమాని వాయిదా వేసుకుంటున్నాను’’ అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.

Updated On 9 Jan 2023 7:46 AM GMT
krs

krs

Next Story