Director | క‌వైపు క్యాస్టింగ్ కౌచ్‌పై హీరోయిన్స్ తీవ్ర‌మైన ఫైట్ చేస్తున్న‌నేప‌థ్యంలో ఓ ద‌ర్శ‌కుడు త‌న సినిమా హీరోయిన్‌కి ప‌బ్లిక్‌గా ముద్దు పెట్టాడు. అంద‌రి ముందు ఆ హీరోయిన్ ద‌ర్శ‌కుడిని ఏమి అన‌లేక సైలెంట్‌గా ఉంది. ఇంత‌కు ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రు అనే క‌దా మీ డౌట్.. బాల‌య్య‌తో వీర‌భ‌ద్ర అనే సినిమాని తెర‌కెక్కించిన ఏఎస్ ర‌వి కుమార్. ఈ ద‌ర్శ‌కుడు చాలా కాలం త‌ర్వాత రాజ్ తరుణ్ తో క‌లిసి ‘తిరగబడరా సామీ’ అనే చిత్రం […]

Director |

క‌వైపు క్యాస్టింగ్ కౌచ్‌పై హీరోయిన్స్ తీవ్ర‌మైన ఫైట్ చేస్తున్న‌నేప‌థ్యంలో ఓ ద‌ర్శ‌కుడు త‌న సినిమా హీరోయిన్‌కి ప‌బ్లిక్‌గా ముద్దు పెట్టాడు. అంద‌రి ముందు ఆ హీరోయిన్ ద‌ర్శ‌కుడిని ఏమి అన‌లేక సైలెంట్‌గా ఉంది. ఇంత‌కు ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రు అనే క‌దా మీ డౌట్.. బాల‌య్య‌తో వీర‌భ‌ద్ర అనే సినిమాని తెర‌కెక్కించిన ఏఎస్ ర‌వి కుమార్.

ఈ ద‌ర్శ‌కుడు చాలా కాలం త‌ర్వాత రాజ్ తరుణ్ తో క‌లిసి ‘తిరగబడరా సామీ’ అనే చిత్రం చేస్తున్నాడు. రీసెంట్‌గా ఈ చిత్ర టైటిల్, టీజర్ విడుదల చేశారు. రాజ్ తరుణ్ కి జంటగా మాల్వి మల్హోత్రా నటిస్తుండ‌గా, ఇందులో మ‌న్నారా చోప్రా కీల‌క పాత్ర పోషించింది.

అయితే టీజ‌ర్ విడుద‌ల‌కి సంబంధించిన కార్య‌క్ర‌మంలో చిత్ర యూనిట్ ప్రెస్మీట్ ఏర్పాటు చేయ‌గా, ఆ కార్య‌క్ర‌మంలో మన్నారా చోప్రా కూడా పాల్గొన్నారు. ఆ స‌మ‌యంలో ద‌ర్శ‌కుడు మ‌న్నారా చోప్రాతో చాలా స‌న్నిహితంగా ఉన్న ద‌ర్శ‌కుడు ర‌వికుమార్ ఆమె బుగ్గ‌పై ముద్దు కూడా పెట్టాడు.

అది చూసి అంద‌రు షాక్ అయ్యారు. ఊహించని పరిణామంతో ప్రెస్ తో పాటు మన్నారా కూడా కొంత ఇబ్బందిగా ఫీలైనా ప‌బ్లిక్‌లో ఉండ‌డం వ‌ల‌న కాస్త న‌వ్వేసి ప‌క్క‌కు వెళ్లింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

ఈ వీడియోని చూసిన ప్ర‌తి ఒక్క‌రు ద‌ర్శ‌కుడిపై ఫుల్ ఫైర్ అవుతున్నారు. అతనికి అంత ఛాన్స్ ఇవ్వ‌కుండా ఉంటే పోయిది. ద‌గ్గ‌ర‌కు లాగిన‌ప్పుడే గ‌ట్టిగా ఇచ్చేసి ఉంటే ముద్దు ఇచ్చేవాడు కాదని కొంద‌రు అంటున్నారు. మ‌రి కొంద‌రు ఇది పబ్లిసిటీ స్టంట్ కూడా కావొచ్చని అంటున్నారు. చిన్న చిత్రాలకు ప్రచారం కల్పించుకోవడం కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నార‌ని కొంద‌రు వాపోతున్నారు.

అయితే రవికుమార్ చౌదరి గ‌తంలో ప‌లు వివాదాల‌లో ఇరుక్కున్నాడు. బాల‌య్య చిత్రం వీర‌భ‌ద్ర మూవీ షూటింగ్‌కి తాగి వ‌చ్చాడ‌ని నిర్మాత అంబికా కృష్ణ ఆరోపించారు. దానికి ర‌వికుమార్ చౌద‌రి స్పందిస్తూ.. బాలకృష్ణ వంటి పెద్ద హీరో సినిమా షూటింగ్ కి తాగి వచ్చే ధైర్యం ఉంటుందా? ఆయన ఊరుకుంటారా?…అంటూ వాటిని ఖండించారు. ర‌వికుమార్ చౌద‌రి గతంలో య‌జ్ఙం, ఆటాడిస్తా, పిల్ల నువ్వు లేని జీవితం వంటి చిత్రాల‌ని కూడా తెర‌కెక్కించాడు.

Updated On 29 Aug 2023 12:41 PM GMT
sn

sn

Next Story