Samantha | స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో శివ నిర్వాణ తెర‌కెక్కించిన చిత్రం ఖుషి. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 1న విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. చిత్రంకి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి మంచి రెస్పాన్స్ ద‌క్కుతుంది. మూడు రోజుల్లోనే 70 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి 100 కోట్ల కలెక్షన్స్ కి దూసుకుపోతున్న ఈ సినిమాకి సంబంధించి స‌క్సెస్ మీట్ కూడా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో విజ‌య్ చాలా ఎమోష‌న‌ల్‌గా మాట్లాడారు. అయితే ఈ […]

Samantha |

స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో శివ నిర్వాణ తెర‌కెక్కించిన చిత్రం ఖుషి. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 1న విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. చిత్రంకి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి మంచి రెస్పాన్స్ ద‌క్కుతుంది. మూడు రోజుల్లోనే 70 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి 100 కోట్ల కలెక్షన్స్ కి దూసుకుపోతున్న ఈ సినిమాకి సంబంధించి స‌క్సెస్ మీట్ కూడా నిర్వ‌హించారు.

ఈ కార్య‌క్ర‌మంలో విజ‌య్ చాలా ఎమోష‌న‌ల్‌గా మాట్లాడారు. అయితే ఈ చిత్రం ఫ్యామిలీ స్టోరీ అని చెబుతున్నా కూడా ఇందులో స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌ధ్య ఉండే లిప్ కిస్ సీన్స్, ఇద్ద‌రు క‌లిసి స్నానం చేస్తున్న‌ట్టు ఉండే సీన్స్ చాలా మందిని ఆశ్చర్య‌ ప‌రిచాయి. దీనిపై కొంద‌రు దారుణ‌మైన విమ‌ర్శలు చేస్తున్నారు.

విడాకులు తీసుకున్న స‌మంత‌తో ఇలాంటి సీన్స్ అన్ని పెట్టి ఫ్యామిలీ సినిమా అని, ప్యూర్ లవ్ సినిమా అని ఎలా చెప్పుకొస్తున్నారు. రొమాంటిక్ సీన్ కూడా లేకుండా ఎన్నో మంచి లవ్ సినిమాలు వచ్చాయి. మరి ఖుషిలో ఎందుకు అంత అంత రొమాంటిక్ సీన్స్ పెట్టాల్సి వ‌చ్చింద‌ని పలువురు ప్ర‌శ్నించారు.

దీనిపై శివ నిర్వాణ స‌మాధానం ఇచ్చారు. చిత్రంలో స‌మంత అవి చేయ‌లేదు, ఆరాధ్య అనే క్యారెక్టర్ చేసింది. ఆ క్యారెక్టర్ ఆ అబ్బాయితో వన్ ఇయర్ ట్రావెల్ చేసింది , పెళ్లి అయింది, పిల్లలు కావాలనే ఎమోషన్ ఉంది, అలాంటప్పుడు ఆ చిన్న ముచ్చ‌ట్లు కూడా ఉండ‌వా అంటూ శివ నిర్వాణ ప్ర‌శ్నించాడు.

జనాలు నమ్మాలి అంటే, కొంచెం రియల్ గా చూపించాలి కదా, వాళ్ళకి రియల్ గానే వైఫ్ అండ్ హస్బెండ్ గా యాక్ట్ చేస్తున్నారని ఫీలింగ్ కూడా రావాలి కాబ‌ట్టి ఆ సీన్స్ పెట్టాల్సి వ‌చ్చిందని శివ నిర్వాణ వివ‌ర‌ణ ఇచ్చారు. అయితే శివ నిర్వాణ చెప్పిన స‌మాధానం ఏ మాత్రం బాగోలేదు అంటూ కొంద‌రు ఆయ‌న‌ని విమ‌ర్శిస్తున్నారు.

ఇక స‌మంత.. నాగ చైత‌న్య నుంచి విడిపోయిన త‌ర్వాత దారుణంగా ఎక్స్‌పోజింగ్ చేయ‌డ‌మే కాకుండా రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోతూ న‌టిస్తుంది. ఎవ‌రు ఎన్ని విమ‌ర్శ‌లు చేసిన కూడా సమంత ఏ మాత్రం త‌గ్గ‌కుండా రొమాంటిక్ సీన్స్ చేసుకుంటూ పోతుంది.

Updated On 8 Sep 2023 8:12 AM GMT
sn

sn

Next Story