విధాత, నందికొండ మున్సిపాలిటీ అధికార బిఆర్ఎస్ పార్టీకి చెందిన చైర్ పర్సన్ కర్ణ అనుష పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ మెజారిటీ కౌన్సిలర్లు జిల్లా అదనపు కలెక్టర్ ఖుష్భూ గుప్తా కు నోటీస్ అందించారు. మొత్తం 12 మంది కౌన్సిలర్లలో చైర్ పర్సన్, వైస్ చైర్మన్ మినహా తొమ్మిది మంది కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రతిపాదించారు. ఒక కాంగ్రెస్ కౌన్సిలర్ గతంలో అకాల మరణం చెందారు . అవిశ్వాసం ప్రతిపాదించిన వారిలో బిఆర్ఎస్ కు చెందిన కౌన్సిలర్లు రామకృష్ణ, […]

విధాత, నందికొండ మున్సిపాలిటీ అధికార బిఆర్ఎస్ పార్టీకి చెందిన చైర్ పర్సన్ కర్ణ అనుష పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ మెజారిటీ కౌన్సిలర్లు జిల్లా అదనపు కలెక్టర్ ఖుష్భూ గుప్తా కు నోటీస్ అందించారు. మొత్తం 12 మంది కౌన్సిలర్లలో చైర్ పర్సన్, వైస్ చైర్మన్ మినహా తొమ్మిది మంది కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రతిపాదించారు.

ఒక కాంగ్రెస్ కౌన్సిలర్ గతంలో అకాల మరణం చెందారు . అవిశ్వాసం ప్రతిపాదించిన వారిలో బిఆర్ఎస్ కు చెందిన కౌన్సిలర్లు రామకృష్ణ, రమేష్, మంగ్తనాయక్, నాగరాణి విక్రమ్, ఇందిరా ,శిరీష మోహన్ నాయక్, శ్వేత , కాంగ్రెస్ కు చెందిన కౌన్సిలర్లు మోహన్ రావు, అన్నపూర్ణ లు ఉన్నారు.

Updated On 1 Feb 2023 12:42 PM GMT
Somu

Somu

Next Story