విధాత: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. ఐఏఎస్ ఆఫీసర్ సోమేశ్ కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదంపై హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తెలంగాణలో సోమేశ్ కుమార్ కొనసాగింపును కోర్టు రద్దు చేసింది.
కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఉత్తర్వులను కోర్టు కొట్టేసింది. రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్ కుమార్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది కేంద్రం. అయితే కేంద్రం ఉత్తర్వులు నిలిపివేసి తెలంగాణలో కొనసాగేలా గతంలో క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది.
క్యాట్ మధ్యంతర ఉత్తర్వులతో సోమేశ్ కుమార్ తెలంగాణలో కొనసాగుతున్నారు. క్యాట్ ఉత్తర్వులు కొట్టేయాలని 2017లో కేంద్రం హైకోర్టును ఆశ్రయించింది. ఎట్టకేలకు క్యాట్ ఉత్తర్వులు కొట్టి వేస్తూ హైకోర్టు సీజే ధర్మాసనం తీర్పు వెల్లడించింది. డిసెంబర్ 2019 నుంచి తెలంగాణ సీఎస్‌గా సోమేశ్ కుమార్ కొనసాగుతున్నారు.
అయితే సోమేష్ కుమార్ న్యాయవాది తీర్పు అమలు 3 వారాలు నిలిపివేయాలని అభ్యర్థించగా కోర్టు అందుకు అంగీకరించలేదు. తీర్పు అనంతరం తక్షణమే ఎపీకి వెళ్లాలని అదేశించింది.
సీఎస్ సోమేశ్ కుమార్ నియామకం అక్రమం అని మేం మొదటి నుండి చెబుతున్నాం. తాజాగా హైకోర్టు అదే చెప్పింది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ధరణి, సీసీఎల్ఎ, రెరాకు హెడ్ గా సోమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాలపై సీబీఐ విచారణ జరిపించాలి. pic.twitter.com/6VtMSXUWUk
— Revanth Reddy (@revanth_anumula) January 10, 2023