విధాత, యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్లకు చెందిన ఆంబోజు నరేష్ , స్వాతిల పరువు హత్య కేసును కొట్టివేస్తూ బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న స్వాతి తండ్రి తుమ్మల శ్రీనివాసరెడ్డి, ఆయన బంధువు నల్ల సత్తిరెడ్డిలపై మోపిన అభియోగాల ను రుజువు చేసేందుకు సరైన సాక్షాధారాలు లేనందున కేసును కొట్టివేస్తున్నట్లు భువనగిరి సెషన్స్ కోర్టు జడ్జి భాస్కరరావు తీర్పు వెల్లడించారు. ఈ కేసు […]

విధాత, యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్లకు చెందిన ఆంబోజు నరేష్ , స్వాతిల పరువు హత్య కేసును కొట్టివేస్తూ బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న స్వాతి తండ్రి తుమ్మల శ్రీనివాసరెడ్డి, ఆయన బంధువు నల్ల సత్తిరెడ్డిలపై మోపిన అభియోగాల ను రుజువు చేసేందుకు సరైన సాక్షాధారాలు లేనందున కేసును కొట్టివేస్తున్నట్లు భువనగిరి సెషన్స్ కోర్టు జడ్జి భాస్కరరావు తీర్పు వెల్లడించారు.

ఈ కేసు పూర్వాపరాలలోకి వెళితే ఆత్మకూర్(ఎం) మండలం పల్లెర్లకు చెందిన ఆంబోజు నరేష్, అదే మండలం లింగరాజు పల్లి చెందిన తుమ్మల స్వాతిలు 2017 మే 25న ప్రేమ వివాహం చేసుకున్నారు. స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి వారి కులాంతర వివాహాన్ని తీవ్రంగా వ్యతిరేకించగా, పెళ్లి అనంతరం ముంబాయి వెళ్లిన వారిద్దరిని రప్పించేందుకు శ్రీనివాస్ రెడ్డి పథకం వేసి కూతురు స్వాతికి ఫోన్ చేసి ప్రేమ పెళ్లిని అంగీకరిస్తానన్నట్లుగా చెప్పి నమ్మించాడు.

శ్రీనివాస్ రెడ్డి మాటలను నమ్మిన స్వాతి, నరేష్ లు ముంబై నుంచి భువనగిరికి వచ్చారు. అక్కడి నుంచి స్వాతి స్వగ్రామానికి వెళ్లే సమయంలో భువనగిరిలో 2015 మే 5న నరేష్ అదృశ్యమయ్యాడు. నరేష్ తల్లిదండ్రులు మరుసటిరోజే భువనగిరి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నరేష్ ఆచూకీ కోసం తండ్రి వెంకటయ్య హైకోర్టును సైతం ఆశ్రయించారు. నరేష్ ను శ్రీనివాస్ రెడ్డి హత్య చేశాడని మృతుడి కుటుంబీకులు ఆరోపించారు.

ఇదే సమయంలో శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఉన్న స్వాతి అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందింది. ఈ ఘటనలపై ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాయి. పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించారు. నరేష్ ను శ్రీనివాస్ రెడ్డి తన వ్యవసాయ బావ వద్దనే హత్య చేసి మృతదేహాన్ని దహనం చేసి ఎముకలను వలిగొండ మండలం సంగం గ్రామంలోని మూసి నదిలో కలిపాడని పోలీసులు దర్యాప్తులో తేల్చారు.

అటు స్వాతి అనుమానాస్పద మృతి వెనక కూడా శ్రీనివాసరెడ్డి హస్తం ఉండవచ్చని పోలీసులు అనుమానించారు. నరేష్, స్వాతిల కేసులో చౌటుప్పల్ ఏసీపీ స్నేహిత ఆధ్వర్యంలో ఆధారాలు సేకరించగా, డీసీపీ వెంకటేశ్వర్లు, ఎసీపీ వేణుగోపాల్ లు విచారణ జరిపి 2017 మే 27న శ్రీనివాస్ రెడ్డిని, సత్తిరెడ్డి లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

2017 లో జరిగిన ఈ కేసులో 2018 జూలై 31న పోలీసులు న్యాయస్థానంలో అభియోగ పత్రాలు దాఖలు చేశారు. 23 మంది సాక్షులను విచారించి, ఫోరెన్సిక్ సహా ఇతర ఆధారాలను కోర్టుకు సమర్పించారు. సుదీర్ఘ విచారణ పిదప ఈ కేసును కోర్టు కొట్టివేస్తూ బుధవారం తీర్పు ఇచ్చింది.

అయితే నరేష్ తండ్రి వెంకటయ్యతో పాటు ప్రజా సంఘాలు కోర్టు తీర్పు పట్ల తీవ్ర నిరాశ ను వ్యక్తం చేశాయి. నిందితులను దోషులుగా తేల్చేందుకు సరైన ఆధారాలు సమర్పించడంలో పోలీసులు వైఫల్యం చెందడం పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.

Updated On 18 Jan 2023 3:15 PM GMT
krs

krs

Next Story