Divorce విధాత : పాశ్చ్యత్త సంస్కృతి ప్రభావం భారతీయులకు నానాటికి పెరిగిపోతున్నా దేశంలో పటిష్టమైన వివాహ బంధాలు మాత్రం పదిలంగానే కొనసాగుతున్నాయి. ప్రపంచ దేశాల్లో భారత దేశంలోనే విడాకుల శాతం అతి తక్కువగా ఉందన్న అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఆధునిక కాలంలో యువతీయువకుల వైవాహిక బంధంలో సర్ధుబాట్లు తగ్గిపోతూ పెళ్లయిన కొద్ది నెలలకే తలోదారి అన్నట్లుగా విడిపోతున్న క్రమంలో భారత దేశం జంటలు వైవాహిక బంధాలను నూరేళ్లు కొనసాగించేందుకే మొగ్గుచూపుతున్నారు. దీంతో ఫ్రపంచంలోనే అతి తక్కువగా కేవలం ఒక […]

Divorce
విధాత : పాశ్చ్యత్త సంస్కృతి ప్రభావం భారతీయులకు నానాటికి పెరిగిపోతున్నా దేశంలో పటిష్టమైన వివాహ బంధాలు మాత్రం పదిలంగానే కొనసాగుతున్నాయి. ప్రపంచ దేశాల్లో భారత దేశంలోనే విడాకుల శాతం అతి తక్కువగా ఉందన్న అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
ఆధునిక కాలంలో యువతీయువకుల వైవాహిక బంధంలో సర్ధుబాట్లు తగ్గిపోతూ పెళ్లయిన కొద్ది నెలలకే తలోదారి అన్నట్లుగా విడిపోతున్న క్రమంలో భారత దేశం జంటలు వైవాహిక బంధాలను నూరేళ్లు కొనసాగించేందుకే మొగ్గుచూపుతున్నారు. దీంతో ఫ్రపంచంలోనే అతి తక్కువగా కేవలం ఒక శాతం విడాకుల రేటుతో భారత దేశం వైవాహిక బంధ రక్షణలో అగ్రగామిగా కొనసాగుతుంది.
ప్రపంచ గణంకా సంస్థ గ్లొబెల్ ఇండెక్స్ తాజా నివేదిక మేరకు భారత్ తర్వాతా వియత్నాం 7శాతం విడాకుల రేటుతో రెండో స్థానంలో ఉంది. ఇదే సమయంలో పోర్చుగల్ దేశం మాత్రం మాత్రం 94శాతం విడాకుల రేటుతో విడాకుల పర్వంలో అగ్ర స్థానంలో ఉండటం గమనార్హం.
పోర్చుగల్ తర్వాతా స్పేయిన్ 85శాతం విడాకుల రేటుతో రెండో స్థానంలో ఉంది. ఫ్రాన్స్, స్వీడన్, బెల్జియం, ఫిన్లాండ్, లక్సెంబర్గ్ యూరోపియన్ దేశాలు 50శాతంకు పైగా విడాకుల రేటు నమోదు చేశాయి. అమెరికా, కెనడాలు 50శాతం విడాకుల రేటుతో కొనసాగుతున్నాయి.
