DK Aruna విధాత : ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తున్న కాంగ్రెస్‌ పార్టీ ముందుగా మూడు హామీలివ్వాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకె అరుణ డిమాండ్‌ చేశారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె విలేఖరులతో మాట్లాడుతూ గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారబోరని, కుంభకోణాలు చేయబోమని, తెలంగాణ చరిత్రను తప్పుదోవ పట్టించబోమన్న మూడు గ్యారంటీలను ఇవ్వాలని అరుణ డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రజా విశ్వాసం కోల్పోయిందని, కాంగ్రెస్‌, […]

DK Aruna

విధాత : ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తున్న కాంగ్రెస్‌ పార్టీ ముందుగా మూడు హామీలివ్వాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకె అరుణ డిమాండ్‌ చేశారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె విలేఖరులతో మాట్లాడుతూ గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారబోరని, కుంభకోణాలు చేయబోమని, తెలంగాణ చరిత్రను తప్పుదోవ పట్టించబోమన్న మూడు గ్యారంటీలను ఇవ్వాలని అరుణ డిమాండ్ చేశారు.

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రజా విశ్వాసం కోల్పోయిందని, కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. ఆరుగ్యారంటీలతో తెలంగాణ ప్రజలను మోసం చేయచూస్తున్న కాంగ్రెస్ కర్ణాటకలో ఇచ్చిన హామీలతో ఆ రాష్ట్రాన్ని దివాళా తీయిస్తుందన్నారు.

అక్కడ కాంగ్రెస్ ఉచిత హామీలతో దెబ్బతింటున్న ఆర్టీసీని కర్ణాటక ప్రభుత్వం ప్రవేటు పరం చేయచూస్తుందన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో 4వేల పింఛన్ ఇవ్వడం లేదని, తెలంగాణ ఇస్తామంటే ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. అధికారం కోసం అడ్డగోలు హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టించి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడం ద్వారా బీజేపీ తన చిత్తశుద్ధిని చాటుకుందన్నారు.

Updated On 19 Sep 2023 12:38 PM GMT
somu

somu

Next Story