విధాత: ట్విట్టర్ కొత్త సీఈవోగా (Twitter CEO) శుక్రవారం నియమితులైన లిండా యాకారినో శనివారం తన మొదటి ట్వీట్ చేశారు. సంస్థ యజమాని ఎలాన్ మస్క్ తనకు స్ఫూర్తి అని తెలిపారు. ఉజ్వల భవిష్యత్తును సృష్టించాలని అనుకొనే ఎలన్ మస్క్ నుంచే తాను ప్రేరణ పొందానని పేర్కొన్నారు. మస్క్ ఆలోచనలు, విజన్‌ను ట్విట్టర్‌లో అమలు చేస్తానని చెప్పారు. ఈ వ్యాపారాన్ని మరింత ఉన్నత స్థితి తీసుకెళ్లేందుకు సహాయపడతానని వెల్లడించారు. ట్విట్టర్ భవిష్యత్తుకు కట్టుబడి ఉన్నానని తెలిపారు.
I see I have some new followers👀…👋 I’m not as prolific as @elonmusk (yet!), but I’m just as committed to the future of this platform.
Your feedback is VITAL to that future. I’m here for all of it.
Let’s keep the conversation going and build Twitter 2.0 together!
— Linda Yaccarino (@lindayacc) May 13, 2023
ట్విట్టర్ తదుపరి సీఈవో కావడానికి ఆమె చర్చలు జరుపుతున్నట్టు గురువారం వార్తలు వెలువడిన తర్వాత యాకారినో బహిరంగంగా మాట్లాడటం ఇదే మొదటిసారి. గత అక్టోబర్‌లో ట్వి్ట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు ఎలన్ మస్క్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. నాటి నుంచి సీఈవోగా పనిచేస్తున్న మస్క్ శుక్రవారం లిండా యాకారినోను కొత్త సీఈవోగా ప్రకటించారు. ఆమె ఎన్‌బీసీ యూనివర్సల్ సంస్థలో పనిచేస్తున్నారు. ఆమె మరో ఆరు నెలల్లో కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నది.