విధాత ఆరోగ్యం: గుడ్డు చవకగా దొరికే గొప్ప ఆహారం. గుడ్డుతో పోలిస్తే ఇతర పోషకాహారాలు ఏవైనా సరే ప్రియమైనవే. ఇవి తినడానికి రుచిగా మాత్రమే కాదు, వండుకోవడం కూడా చాలా సులభం. ఏ సమయంలో తీసుకున్నా, బ్రేక్ ఫాస్ట్, లంచ్ లేదా డిన్నర్‌లో ఏ రూపంలో తీసుకున్నా ఏం ఫర్వాలేదు. పోషకాహారం కనుక భోజనంలో వీటికో ప్రత్యేకత. తినాల్సింది గుడ్డులోని తెల్ల సొన మాత్రమే అనుకుంటే పప్పులో కాలేసినట్టే. గుడ్డు మొత్తం నిస్సందేహంగా తినొచ్చని నిపుణులు అంటున్నారు. […]

విధాత ఆరోగ్యం: గుడ్డు చవకగా దొరికే గొప్ప ఆహారం. గుడ్డుతో పోలిస్తే ఇతర పోషకాహారాలు ఏవైనా సరే ప్రియమైనవే. ఇవి తినడానికి రుచిగా మాత్రమే కాదు, వండుకోవడం కూడా చాలా సులభం. ఏ సమయంలో తీసుకున్నా, బ్రేక్ ఫాస్ట్, లంచ్ లేదా డిన్నర్‌లో ఏ రూపంలో తీసుకున్నా ఏం ఫర్వాలేదు. పోషకాహారం కనుక భోజనంలో వీటికో ప్రత్యేకత.

తినాల్సింది గుడ్డులోని తెల్ల సొన మాత్రమే అనుకుంటే పప్పులో కాలేసినట్టే. గుడ్డు మొత్తం నిస్సందేహంగా తినొచ్చని నిపుణులు అంటున్నారు. ఇందులో బోలెడు విటమిన్స్, మినరల్స్ తో నిండి ఉంటాయి. గుడ్డులో విటమిన్ సి, విటమిన్ బి3 మినహా మిగిలిన అన్ని పోషకాలు ఉంటాయి. రోజూ ఆహారంలో గుడ్డు తీసుకోవిడం మొదలు పెట్టిన తర్వాత చాలా కొద్ది కాలంలోనే శక్తి సంతరించు కోవడం, బలంగా తయారవడాన్ని గమనించవచ్చు.

వయసుతో సంబంధం లేకుండా.. అవ్వను సంతోషపరిచిన తాత.. వీడియో వైరల్

ప్రోటీన్లు పుష్కలం

కండర పుష్టికి, ఎముకల బలానికి ప్రొటీన్ చాలా అవసరం. గుడ్లలో చాలా మంచి ప్రొటీన్ రిసోర్స్. గుడ్డు నుంచి లభ్యమయ్యే ప్రొటీన్ వల్ల బరువు కూడా పెరగదని రాబ్ హాబ్సన్ అనే న్యూట్రిషనిస్ట్ అంటున్నారు. బ్రేక్ ఫాస్ట్ లో గుడ్డు తీసుకుంటే పోషకాలు అందడమే కాదు కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ వల్ల రోజంతా తీసుకునే ఆహారం ద్వారా వచ్చే కాలరీలు దాదాపు 400 వరకు తగ్గినట్టు ఒక అధ్యయనంలో తేలిందని రాబ్ అంటున్నారు. తగినంత ప్రొటీన్ తీసుకున్నపుడే పిల్లల్లో పెరుగుదల, కండరాలు బలాన్ని సంతరించుకోవడానికి చాలా అవసరం.

ఈ మధ్య చాలా మంది మధ్య వయస్కులు కూడా సిక్స్ ప్యాక్ కోసం శ్రమిస్తున్నారు. అలాంటి ఆశ పడేవారు కొన్ని ప్రత్యేక వర్కవుట్స్ తోపాటు ప్రొటీన్ ఇన్ టేక్ మీద ప్రత్యేక దృష్టి పెడతారు. ఇలాంటి వారికి గుడ్డు సహజమైన ప్రొటీన్ సోర్స్. పోస్ట్ వర్కవుట్ స్నాక్ గా గుడ్డు మంచి ఆప్షన్.

రెండు మీల్స్ మధ్య ఎక్కువ గ్యాప్ వచ్చినపుడు షుగర్ లెవెల్స్ సంతులన పరచడానికి కలిగిన స్నాక్ ఏదైనా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. అయితే రెడీమేడ్ దొరకే స్నాక్స్ తో షుగర్స్ ఉంటాయి కనుక వాటిని తీసుకోవడం వల్ల షుగర్ స్థాయి పెరిగే ప్రమాదం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో గుడ్డు తినడం మంచిదని న్యూట్రిషనిస్టులు అంటున్నారు. ఆకలి తీరడమే కాదు షుగర్ కూడా పెరగదనేది వారి అభిప్రాయం.

40 రోజుల్లో 40 కోళ్లు తినేశాడు.. చికెన్ మ్యాన్‌గా గుర్తింపు

గుడ్డు ద్వారా విటమిన్ డి లభిస్తుంది. చాలా రకాల అనారోగ్యాలతో పోరాడడానికి ఈ విటమిన్ అవసరం. రోజు వారీ విటమిన్ డి అవసరంలో 29 శాతం కేవలం రెండు గుడ్లు తినడం ద్వారా శరీరానికి అందించవచ్చు. కొలైన్ అనే యాంటీ ఆక్సిడెంట్ గుడ్డులో పుష్కలంగా ఉంటుంది. ఇది మెమొరీలాస్ అవకుండా నివారిస్తుంది. ఇది మాత్రమే కాదు వయసు పై బడుతున్న కొద్దీ వచ్చే మాలిక్యూలార్ డీజనరేషన్, కంటి చూపుకు రక్షణ ఇచ్చే జియాక్సథిన్, ల్యూటిన్ వంటి యాంటి ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి.

నిరోధక శక్తికి గుడ్డులో ఉండే పోషకాలు రోగనిరోధక వ్యవస్థ మీద కూడా ప్రభావం చూపుతాయి. ఏ,డీ,ఈతో పాటు జింక్, సెలెనియం, ఐరన్ వంటి మినరల్స్ కూడా ఉంటాయి. ఈ పోషకాలు నిరోదక వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తాయి. విటమిన్, ఐరన్, జింక్, సెలెనియం ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించే యాంటీబాడీల ఉత్పత్తికి ఉపకరిస్తాయి.

మరి కొలెస్ట్రాల్ ?

ఇప్పటి వరకు గుడ్డు తినడానికి వెనుకాడేది కొలెస్ట్రాల్ పెరుగుతుందన్న కారణంతో అయితే రోజు గుడ్లు ఆహారంలో భాగం చేసుకునే వారు ఇతర పదార్థాలు కొంచెం తగ్గించి తీసుకోవాలని నిపుణుల సూచన. గుడ్లు కొంచెం పరిమితికి మించి తినే వారిలో గుండె జబ్బుల రిస్క్ ఉంటుంది. తీసుకునే భోజనంలో ఉండే కొలెస్ట్రాల్ కచ్చితంగా రక్తంలో కొలెస్ట్రాల్ పెంచుతుందని చెప్పలేము. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరగడానికి ఇంకా చాలా పరిస్థితులు దోహదం చేస్తాయి.

గుడ్డు తినండిలా

ఎలా తిన్నా గుడ్డు రుచిగా ఉంటుంది. అంతేకాదు చాలా ఆరోగ్యవంతమైంది కూడా అందుకే ఇలాగే తినాలనే నియమేమీ లేదు. స్కాంబుల్డ్ ఎగ్స్ పుట్టగొడుగులు టమాటలతో కలిపి బ్రెడ్ టోస్ట్ తో తినొచ్చు.
గుడ్డును బేక్ చేసి టామట సాస్ తో తినొచ్చు

ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒక మంచి డిన్నర్ ఆప్షన్. అయితే ఇందులో తాజా కూరగాయలను కూడా కలుపుకుంటే మరింత ఆరోగ్యం రుచి కూడా. ఉడికించి, ఆమ్లెట్ చేసి, స్క్రాంబుల్ చేసి, బేక్ చేసి, ఫ్రై చేసి ఎలా తిన్నా కూడా గుడ్డులోని పోషకాల్లో తేడా ఏమీ రాదు. కనుక నచ్చినట్టు గుడ్డు తినెయ్యండి.

ఎక్కువ సార్లు టాయిలెట్‌కు వెళ్తున్నారా? మీకు ఈ అనారోగ్యాలు ఉన్నాయేమో!

Updated On 8 Nov 2022 12:53 PM GMT
krs

krs

Next Story