విధాత: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఓ డాక్టర్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. కాల్పుల శబ్దం విన్న స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. తుపాకీతో కాల్చుకున్న వ్యక్తిని చికిత్స నిమిత్తం జూబ్లీహిల్స్ అపోలోకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను ప్రాణాలు కోల్పోయాడు.
తుపాకీతో కాల్చుకున్న వ్యక్తిని డాక్టర్ మజారుద్దీన్‌గా పోలీసులు గుర్తించారు. డాక్టర్ మజారుద్దీన్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.