విధాత: వివాదాస్పద బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన విషయంలో ఢిల్లీ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ (India: The Modi Question) ని ఢిల్లీ యూనివర్సిటీ ఆర్ట్స్ ఫ్యాకల్టీ క్యాంపస్‌లో శుక్రవారం ప్రదర్శించేందుకు NSUI, భీం ఆర్మీ స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థులు ప్రయత్నించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.
క్యాంపస్ నుంచి విద్యార్థులను బయటకు లాక్కుపోయారు. విద్యార్థులు డాక్యుమెంటరీని ప్రశాంతంగా వీక్షించేందుకు సిద్ధమైనా పోలీసులు అత్యుత్సాహం చూపారని విద్యార్థి నేతలు ఆరోపించారు. కార్యక్రమానికి వచ్చిన విద్యార్థులపై ‘సంఘీ గూన్స్‘ దాడులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.