విధాత‌: కరోనా కాలం నుండి బాలీవుడ్ పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయింది. కరోనాకు ముందు ఉన్న పరిస్థితులకు సౌత్ ఇండియా చేరుకున్నా.. బాలీవుడ్‌ మాత్రం ఇంకా ఆ పరిస్థితికి చేరుకోలేదనే చెప్పుకోవాలి. ఈ సమయంలో బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ముంబైలో ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ని కలిశాడు. ఆయనతో పాటు పలువులు సినీ ప్ర‌ముఖులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీకి సంబంధించిన పలు విషయాల […]

విధాత‌: కరోనా కాలం నుండి బాలీవుడ్ పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయింది. కరోనాకు ముందు ఉన్న పరిస్థితులకు సౌత్ ఇండియా చేరుకున్నా.. బాలీవుడ్‌ మాత్రం ఇంకా ఆ పరిస్థితికి చేరుకోలేదనే చెప్పుకోవాలి. ఈ సమయంలో బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

తాజాగా ముంబైలో ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ని కలిశాడు. ఆయనతో పాటు పలువులు సినీ ప్ర‌ముఖులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీకి సంబంధించిన పలు విషయాల గురించి ఆయనతో మాట్లాడటం జరిగిందని తెలుస్తుంది. హిందీ సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సవాళ్లు, ప్రభుత్వ పరంగా అందాల్సిన సహాయం గురించి వారు ముఖ్యమంత్రికి తెలియజేశారని అంటున్నారు.

ఈ సందర్భంగా సునీల్ శెట్టి మాట్లాడుతూ.. నేను బాలీవుడ్‌లో 32 ఏళ్లుగా కొనసాగుతున్నాను. గతంలో ఎప్పుడూ చూడని పరిస్థితులు ఇప్పుడు చూస్తున్నాను. కంటెంట్ ఉన్న సినిమాలను రూపొందించాల్సిన అవసరం ఈ సమయంలో చాలా ఉంది. సినిమాల మేకింగ్ విషయంలో ఫైనాన్స్ డేటా విశ్లేషణ ప్రమేయం ఉండకూడదు. ఫిలిం మేకర్స్ ముఖ్యంగా యంగ్ ఫిలిం మేకర్స్‌కు ఛాన్స్ ఇవ్వాలి. వారి విజ్ఞానం అందిపుచ్చుకోవడంలో మనం ముందుండాలి. వారి ప్రతిభకు తగ్గట్టు అవకాశాలు ఇవ్వాలి.

ఈ మధ్యకాలంలో ఒక సినిమా సక్సెస్ అయితే దాన్ని మనం సరిగా ప్రమోట్ చేయడం లేదు. మన సినిమా సక్సెస్ అయితే పబ్లిసిటీ చేసుకోవడం తప్పనిసరి. దాని ద్వారానే అది పదిమందికి తెలుస్తుంది. మన ఇండస్ట్రీ గురించి మనం మాట్లాడకుండా మౌనంగా ఉండకూడదు.

మన సినిమా స్థాయిని లోకానికి తెలిసేలా చాటి చెప్పాల్సిన సమయం ఇది.. ఇక బాయ్‌కాట్ హాష్ ట్యాగ్లు పెట్టేవారు కూడా దయచేసి ప్రస్తుతం బాలీవుడ్‌లో ఉన్న పరిస్థితులు చూసుకోవాలి. బాయ్‌కాట్ బాలీవుడ్ మెసేజ్‌లని మానుకోవాలి… అంటూ విజ్ఞప్తి చేశారు. బాలీవుడ్ సినిమా మళ్లీ గాడిన పడాలి అంటే యువతకు ప్రాముఖ్యత ఇవ్వాలని, ప్రచారం తప్పనిసరి అని ఆయన తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు.

Updated On 8 Jan 2023 8:40 AM GMT
krs

krs

Next Story