సీక్రెట్‌ను దాచేందుకు డబ్బు చెల్లింపు మాజీ అధ్యక్షుడిపై అభియోగాలు నమోదు తనకేమీ తెలియదంటున్న డొనాల్డ్‌ ట్రంప్‌ తాను ఆమెతో ‘కలవలేద’ని బుకాయింపు ఎప్పుడూ వివాదాల్లో ఉండే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) చిక్కుల్లో పడ్డారు. నేర అభియోగాలు మోపబడిన తొట్ట తొలి అమెరికా మాజీ అధ్యక్షుడిగా అపప్రథ మూటగట్టుకున్నారు. తాను తొలిసారి అధ్యక్షుడిగా పోటీ చేసిన 2016 ప్రచారం సందర్భంగా ఒక పోర్న్‌స్టార్‌కు భారీగా డబ్బు చెల్లించారన్న ఆరోపణలపై న్యూయార్క్‌ గ్రాండ్‌ జ్యూరీ […]

  • సీక్రెట్‌ను దాచేందుకు డబ్బు చెల్లింపు
  • మాజీ అధ్యక్షుడిపై అభియోగాలు నమోదు
  • తనకేమీ తెలియదంటున్న డొనాల్డ్‌ ట్రంప్‌
  • తాను ఆమెతో ‘కలవలేద’ని బుకాయింపు

ఎప్పుడూ వివాదాల్లో ఉండే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) చిక్కుల్లో పడ్డారు. నేర అభియోగాలు మోపబడిన తొట్ట తొలి అమెరికా మాజీ అధ్యక్షుడిగా అపప్రథ మూటగట్టుకున్నారు. తాను తొలిసారి అధ్యక్షుడిగా పోటీ చేసిన 2016 ప్రచారం సందర్భంగా ఒక పోర్న్‌స్టార్‌కు భారీగా డబ్బు చెల్లించారన్న ఆరోపణలపై న్యూయార్క్‌ గ్రాండ్‌ జ్యూరీ అభియోగాలు మోపింది.

విధాత: రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీకి నిలబడాలని భావిస్తున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు భారీ షాక్‌ తగిలింది. స్ట్రామీ డేనియల్స్‌ అనే అశ్లీల చిత్రాల నటికి ఒక రహస్యం దాచి పెట్టేందుకు 1,30,000 డాలర్లు హుష్‌ మనీగా చెల్లించారని ఆయనపై ఆరోపణలపై న్యూయార్క్‌ గ్రాండ్‌ జ్యూరీ నేరపూరిత అభియోగాలను నమోదు చేసింది. ఈ తరహా అభియోగాలు నమోదైన మొట్టమొదటి అమెరికా మాజీ అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ నిలిచారు.

ఇదీ సంగతి..

అడల్డ్‌ ఫిల్మ్‌ నటి స్ట్రామీ డేనియల్స్‌ను 2006లో డొనాల్డ్‌ ట్రంప్‌ ఒక గోల్ఫ్‌ టోర్నమెంట్‌ సందర్భంగా కలిశారు. అప్పట్లో ఆయన రియల్‌ ఎస్టేట్‌ టైకూన్‌. అప్పటికి డేనియల్స్‌ వయసు 27 ఏండ్లు. ట్రంప్‌కు 60 ఏళ్లు. అప్పటికి నాలుగు నెలలు ముందు ట్రంప్‌ మూడో భార్యకు బారన్‌ జన్మించాడు. ట్రంప్‌తో తన సంబంధాలపై డేనియల్స్‌ ‘ఫుల్‌ డిస్‌క్లోజర్‌’ అనే పుస్తకంలో రాసింది. ఈ పుస్తకం 2018లో ప్రచురించారు.

కలుసుకోవాలని..

ఆ సమయంలో ట్రంప్‌ ‘ది అప్రెంటిస్‌’ అనే పేరుతో టీవీ షో నిర్వహిస్తున్నారు. ఈ షో విషయమై ట్రంప్‌ తన పెంట్‌హౌస్‌లో కలవాలనుకుంటున్నారని తనకు ట్రంప్‌ బాడీ గార్డ్‌ ఒకరు చెప్పారని డేనియల్స్‌ రాసింది. ఈ సందర్భంగా తమ మధ్య జరిగిన వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ.. ‘అంత చెత్త సెక్స్‌ నేను ఎప్పడూ అనుభవించలేదు’ అని రాసింది.

ట్రంప్‌ శరీర భాగాల గురించి చెప్పుకోలేని అంశాలను కూడా ప్రస్తావించింది. అయితే.. తాను ఆమెతో సెక్స్‌ చేయలేదని, ఈ విషయాలు చెప్పడం ద్వారా ఆమె డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నదని ఆరోపించారు. అది పూర్తి అసత్యమని అన్నారు.

130000 డాలర్ల చెల్లింపు

2016కు వస్తే ఆ సమయంలో ట్రంప్‌ రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష నామినీగా ఉన్నారు. 2006 నాటి ఘటనపై నోరు మెదపకుండా ఉండేందుకు డేనియల్స్‌కు 1,30,000 డాలర్లు ‘హుష్‌మనీ’ (కోటి రూపాయల పైనే) చెల్లించినట్టు ట్రంప్‌ వ్యక్తిగత న్యాయవాది మైఖేల్‌ కొహెన్‌ అంగీకరించారు. అంతా రహస్యంగా జరిగిపోయిందనుకున్న సమయంలో ఈ వార్తను వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ 2018 జనవరిలో బాంబులా పేల్చింది. దీని ఆధారంగా చేసిన ఆరోపణలపైనే తాజా అభియోగాలు ట్రంప్‌పై నమోదయ్యాయి

Updated On 1 April 2023 3:10 AM GMT
Somu

Somu

Next Story