విధాత: యూనివర్సిటీ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లుపై సందేహాలు వ్య‌క్తం చేసిన గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసైతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ అధికారులు భేటీ అయ్యారు. గ‌వ‌ర్న‌ర్ లేవ‌నెత్తిన సందేహాల‌ను మంత్రి, అధికారులు నివృత్తి చేశారు. దాదాపు 45 నిమిషాలు పాటు సమావేశం కొనసాగింది. బిల్లుపై తనకు ఉన్న అనుమానాలను గ‌వ‌ర్న‌ర్ అడిగారు. యూజీసీ నిబంధనలు, న్యాయ పరమైన అంశాలను ప్రస్తావించారు. అన్నింటిని పూర్తి స్థాయిలో నిబంధ‌న‌లు పాటిస్తున్నామని, ఎటువంటి ఇబ్బందులు ఉండబోవని గవర్నర్‌కు మంత్రి ,అధికారులు తెలిపారు. […]

విధాత: యూనివర్సిటీ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లుపై సందేహాలు వ్య‌క్తం చేసిన గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసైతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ అధికారులు భేటీ అయ్యారు. గ‌వ‌ర్న‌ర్ లేవ‌నెత్తిన సందేహాల‌ను మంత్రి, అధికారులు నివృత్తి చేశారు. దాదాపు 45 నిమిషాలు పాటు సమావేశం కొనసాగింది.

బిల్లుపై తనకు ఉన్న అనుమానాలను గ‌వ‌ర్న‌ర్ అడిగారు. యూజీసీ నిబంధనలు, న్యాయ పరమైన అంశాలను ప్రస్తావించారు. అన్నింటిని పూర్తి స్థాయిలో నిబంధ‌న‌లు పాటిస్తున్నామని, ఎటువంటి ఇబ్బందులు ఉండబోవని గవర్నర్‌కు మంత్రి ,అధికారులు తెలిపారు.

ప్రస్తుత విధానంలోని ఇబ్బందులు ,కొత్త విధానం ద్వారా జరిగే లాభాన్ని వివరించారు. మంత్రి, అధికారుల స‌మాధానాలు విన్న‌ త‌ర్వాత‌ నియామాకాలు త్వరగా జరగాలన్నదే తన అభిమతమ‌ని గవర్నర్ పేర్కొన్నారు. మంత్రి వెంట విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ, ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Updated On 10 Nov 2022 1:29 PM GMT
krs

krs

Next Story