Munugodu | విధాత: కమ్యూనిస్టులతో పొత్తు నేపథ్యంలో మునుగోడు టికెట్‌ సీపీఐకి ఇవ్వవద్దంటూ పీసీసీ నేత పాల్వాయి స్రవంతి కాంగ్రెస్‌ అధిష్టానాన్ని కోరారు. మునుగోడు సీటును సీపీఐకి కేటాయించడం ద్వారా కాంగ్రెస్‌ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీయవద్దని, వచ్చే ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్‌కు గెలుపు అవకాశాలున్నాయన్నారు. ఉప ఎన్నికల్లో అధికార బీఆరెస్‌ పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం చేసి డబ్బు, మద్యం పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభా పెట్టి గెలిచిందని, బీజేపీ అభ్యర్ధి కూడా అంతే స్థాయిలో ఖర్చు […]

Munugodu |

విధాత: కమ్యూనిస్టులతో పొత్తు నేపథ్యంలో మునుగోడు టికెట్‌ సీపీఐకి ఇవ్వవద్దంటూ పీసీసీ నేత పాల్వాయి స్రవంతి కాంగ్రెస్‌ అధిష్టానాన్ని కోరారు. మునుగోడు సీటును సీపీఐకి కేటాయించడం ద్వారా కాంగ్రెస్‌ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీయవద్దని, వచ్చే ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్‌కు గెలుపు అవకాశాలున్నాయన్నారు.

ఉప ఎన్నికల్లో అధికార బీఆరెస్‌ పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం చేసి డబ్బు, మద్యం పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభా పెట్టి గెలిచిందని, బీజేపీ అభ్యర్ధి కూడా అంతే స్థాయిలో ఖర్చు చేశారని, ఐనప్పటికీ కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు కాపాడుకో గలిగామన్నారు. మొదటి నుంచి కూడా మెజార్టీ మునుగోడు ప్రజలు కాంగ్రెస్‌ వెంటే నడుస్తున్నారని, 2018ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించిన సంగతి మరువరాదన్నారు.

Updated On 28 Aug 2023 2:52 PM GMT
krs

krs

Next Story