Homelatestగవర్నర్ వ్యవస్థకు కళంకం తేవద్దు.. మంత్రి సత్యవతి రాథోడ్ బహిరంగ లేఖ

గవర్నర్ వ్యవస్థకు కళంకం తేవద్దు.. మంత్రి సత్యవతి రాథోడ్ బహిరంగ లేఖ

  • కేంద్రం నుంచి తెలంగాణకు రావల్సిన వాటి గురించి స్పందించరా?
  • ఉగాది మాదిరి తెలంగాణ చేదుగా ఉందా?
  • గవర్నర్‌కు లేఖ రాసిన మంత్రి సత్యవతి రాథోడ్

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: గవర్నర్ వ్యవస్థకు కళంకం తేకూడదని రాష్ట్ర గవర్నర్ తమిళసైని ఉద్దేశించి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు కేంద్రం నుంచి తెలంగాణకు రావలసిన వాటి గురించి గవర్నర్ ఎప్పుడైనా స్పందించారా అంటూ ప్రశ్నించారు.

హనుమకొండలో మంగళవారం మంత్రి సత్యవతి రాథోడ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌ భాస్కర్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సత్యవతి గవర్నర్‌కు మూడు పేజీల లేఖను రాశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉగాది చేదుగా ఉన్నట్టు తెలంగాణ చేదుగా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అనేక మంది యువకులు బలిదానాలు చేసి సాధించిన విషయం మంత్రి గుర్తు చేశారు.

కేంద్రప్రభుత్వ విధానాలు, నిధుల విడుదల జాప్యం వల్ల రాష్టంలో కొన్ని సమస్యలు నెలకొన్నాయని విమర్శించారు. కేంద్రప్రభుత్వం ప్రతినిధిగా రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించాలని అన్నారు. తెలంగాణ ఏర్పాటు నీళ్లు, నిధులు, నియమాల లక్ష్యంగా ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో రెండు పంటలకు నీళ్లు ఇస్తుందని, నిరుద్యోగ యువకులకు
ప్రభుత్వ ఉద్యోగలు కల్పించామన్నారు.

కేంద్రం హామీల గురించి ప్రశ్నించారా?

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని మంత్రి విమర్శించారు. ప్రభుత్వ సంస్థలను ప్రయివేట్ పరం చేస్తుంది నిజం కాదా? రాష్ట్రానికి రావాల్సిన నిధులు, నియామకాలు, బయ్యారం, గిరిజన యూనివర్సిటీ ఏమైందని ప్రశ్నించారు.

రాజ్ భవన్ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడు తలుపులు తీసేవుంటుందని చెప్పిన గవర్నర్ తెలంగాణ ప్రజలకు కేంద్రం నుండి వచ్చే ఉద్యోగాల గూర్చి ఎప్పుడైనా చెప్పారా? అంటూ అడిగారు. 5 షెడ్యుల్, జీవో3 కొట్టి వేస్తే ఎప్పుడైనా మాట్లాడారా? అంటూ ప్రశ్నించారు.

విపక్షాలపై ఈడీ, సీబీఐ దాడులు

యువతకు అండగా ఉంటానని చెప్పిన గవర్నర్ రాష్ట్రానికి నవోదయ వచ్చిందా, మెడికల్ కళాశాల వచ్చిందా పరిశీలించారా అంటూ మంత్రి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలలో రాజకీయ పార్టీలు నచ్చకుంటే ఈడి, సీబీఐ దాడులు చేస్తున్నది నిజం కాదా? అంటూ ఎమ్మెల్సీ కవితను ఈడి కావాలని ఇబ్బందులు పెడుతుందని మంత్రి సత్యవతి అన్నారు.

ఈ మీడియా సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ బాస్కర్, మేయర్ గుండు సుధారాణి, మాజీ ఎంపీ సీతారాం నాయక్, జెడ్పిటిసి పెద్ది స్వప్న, మర్రి యాదవరెడ్డి పాల్గొన్నారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular