Tuesday, January 31, 2023
More
    Homelatestవీరయ్య చూడొద్దు.. వీరసింహారెడ్డి చూడు: రామ్ చరణ్‌తో బాలయ్య

    వీరయ్య చూడొద్దు.. వీరసింహారెడ్డి చూడు: రామ్ చరణ్‌తో బాలయ్య

    బాలయ్య మాట‌కారిత‌నానికి ఎవరైనా పడిపోవాల్సిందే!

    విధాత: బాలయ్య సామాన్యంగా మీడియా ముందు మాట్లాడేటప్పుడు, సినిమా వేడుకల్లో మాట్లాడేటప్పుడు ఒక దానికి ఒకటి సంబంధం లేకుండా ఏవేవో మాట్లాడతాడనే విమర్శ ఉంది. కానీ అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె మొద‌లైన‌ తరువాత బాలయ్యలోని అసలుసిస‌లు మాటకారి బయటకు వచ్చాడు. ఆయన అతిధులను అడుగుతున్న ప్రశ్నలు… వారిని ఇరుకున పెడుతున్న విధానం.. తమాషాగా ఉన్నాయి. అతిథుల‌తో ఆయ‌న స‌మ‌యోచితంగా చేస్తోన్న పరాచకాలు… వారిని ఆటపట్టించడం వంటివి చూస్తే ఎవరికైనా బాలయ్య ఇంత మంచి మాటకారా అనిపించక మానదు.

    ఇక విషయానికొస్తే ప్రేక్షకులను చాలా కాలం నుండి ఊరిస్తూ వచ్చిన అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె ప్రభాస్ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ ఎపిసోడ్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఎదురుచూపులకు తగ్గట్టుగానే ఆహా మీడియా వారు ప్రభాస్ ఫ్యాన్స్‌కి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇది మొద‌ట కేవలం ఒక ఎపిసోడ్ మాత్రమే అని ప్రచారంలోకి వచ్చింది. కానీ అభిమానులను పూర్తి స్థాయిలో సంతృప్తి పరచేందుకు ఆహా మీడియా రెండు పార్ట్‌లుగా ఈ ఎపిసోడ్‌ను విభ‌జించారు. ఈ రెండు పార్ట్స్ మొత్తం ఫుల్ ఫ‌తో నిండిపోయాయని అంటున్నారు.

    ఇక మొదటి పార్ట్‌కు సంబంధించిన రెండో ప్రోమోని కూడా విడుదల చేశారు. ఇందులో ముందుగా బాలయ్య ప్ర‌భాస్‌తో మాట్లాడుతూ అందర్నీ డార్లింగ్ డార్లింగ్ అని పిలుస్తావు… నీ పిలుపుకే అందరూ పడిపోతారు.. వారిలో నేను కూడా ఉన్నాను… అంటాడు. ఈ ఎపిసోడ్‌లో ప్రభాస్, రామ్ చరణ్‌కి ఫోన్ చేస్తాడు అనే విషయం మొదటినుంచి మనకు అర్థమైంది. రెండో ప్రోమోలో కూడా రామ్ చరణ్‌తో ఫోన్ కాల్‌కి సంబంధించి ఒక చిన్న బిట్టు ఉంది.

    ఓ చోట బాలయ్య చరణ్ తో మాట్లాడుతూ.. ఈ సంక్రాంతికి ముందు నా సినిమానే చూడు…. మీ నాన్న సినిమా తర్వాత చూడు అంటాడు. ఇది విన‌డానికి చూడటానికి ఎంతో సరదాగా అనిపించింది. ఇది అభిమానులకు భలే ఫన్నీగా అనిపించింది. మరి రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య జనవరి 13న విడుదల కానుండగా.. నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి.. ఒక రోజు ముందే అంటే జనవరి 12న విడుదల కానుంది. మరి చ‌ర‌ణ్.. బాలయ్య సినిమాను ముందుగా చూస్తాడా? లేక తన తండ్రి సినిమాను మొదట‌గా చూస్తాడా? అనేది రామ్ చరణ్ ఇష్టమే కానీ.. బాలయ్య ఈ ప్రశ్న చరణ్‌ని అడగి మంచి ఫన్ జనరేట్ చేశాడు.

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular