Viral Video | బలవంతులు కూడా కొన్ని సందర్భాల్లో బలహీనులు అయిపోతుంటారు. బలహీనులు కూడా ఐకమత్యం ప్రదర్శించి, బలవంతుడిని దెబ్బకొడుతుంటారు. అందుకు ఈ వీడియోనే నిదర్శనం. అది దక్షిణాఫ్రికాలోని అరధుస సఫారీ పార్కు.. ఆ పార్కులో ఉన్న హైనాలన్నీ స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. అంతలోనే హైనాలు సంచరిస్తున్న ప్రాంతానికి ఓ సింహం మెరుపువేగంతో వచ్చింది. సింహాన్ని చూసిన హైనాలు తప్పించుకున్నాయి. కానీ ఒక హైనాను మాత్రం సింహాం చేజిక్కించుకుంది. నోటకరుచుకుని దాడి చేస్తున్న సింహాన్ని చూసి మిగతా హైనాలు […]

Viral Video | బలవంతులు కూడా కొన్ని సందర్భాల్లో బలహీనులు అయిపోతుంటారు. బలహీనులు కూడా ఐకమత్యం ప్రదర్శించి, బలవంతుడిని దెబ్బకొడుతుంటారు. అందుకు ఈ వీడియోనే నిదర్శనం.
అది దక్షిణాఫ్రికాలోని అరధుస సఫారీ పార్కు.. ఆ పార్కులో ఉన్న హైనాలన్నీ స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. అంతలోనే హైనాలు సంచరిస్తున్న ప్రాంతానికి ఓ సింహం మెరుపువేగంతో వచ్చింది. సింహాన్ని చూసిన హైనాలు తప్పించుకున్నాయి. కానీ ఒక హైనాను మాత్రం సింహాం చేజిక్కించుకుంది. నోటకరుచుకుని దాడి చేస్తున్న సింహాన్ని చూసి మిగతా హైనాలు ఐకమత్యం ప్రదర్శించాయి. గట్టిగా అరుస్తూ అన్ని హైనాలు సింహాంపైకి దూసుకొచ్చాయి. హైనాను కాపాడేందుకు యత్నించాయి. చివరకు హైనాల దాడికి సింహాం అక్కడ్నుంచి పారిపోయింది.
ఈ దృశ్యాన్ని ఆస్ట్రేలియాకు చెందిన మార్గట్, మ్యాడీ లోవే కలిసి చిత్రీకరించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైనాను కాపాడుకునేందుకు హైనాల గుంపు ప్రదర్శించిన సమన్వయం, పోరాటపటిమపై నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు.
